Pink Remake: ‘‘అనసూయ డిప్రెషన్లో ఉంది, కరెక్ట్ టైంలో పవన్ పిలిచారు’’
ప్రముఖ యాంకర్ అనసూయకు ‘పింక్’ తెలుగు రీమేక్‌లో నటించే అవకాశం వచ్చిందని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. ఓ కీలక పాత్రలో నటించే అవకాశం దక్కినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై కీలక అంశాలు వెల్లడించారు ప్రముఖ సినీ విశ్లేషకులు ఇమంది రామారావు.
అనసూయలో ఓ స్మితా పాటిల్ ఉన్నారు
‘‘అనసూయలో ఏదో తెలీని అందం ఉంది. ఆమె కళ్లు చూస్తే అలనాటి నటి స్మితా పాటిల్ గుర్తుకొస్తారు. చూడటానికి కాస్త సెక్సీగానూ ఉంటారు. మొరటుతనం, అమాయకత్వం కూడా ఉంది. అందుకే ఆమె ‘క్షణం’, ‘రంగస్థలం’ లాంటి సినిమాల్లో మంచి పాత్రలు దక్కించుకున్నారు. ‘రంగస్థలం’ చూసాక పవన్ అనసూయ గురించి ఓ మాటన్నారు. ఆ అమ్మాయి చాలా బాగుంది, చాలా బాగా నటించింది ఎవరు అని అడిగారట. బహుశా అప్పుడే తన సినిమాలో అనసూయకు మంచి పాత్ర ఇవ్వాలని పవన్ నిర్ణయించుకున్నారేమో’’