యాప్నగరం

MeToo: నటికి వేధింపులు.. క్యాస్టింగ్‌ డైరెక్టర్‌పై ఎఫ్‌ఐఆర్‌

MeToo ఉద్యమం తీవ్రరూపం దాల్చిన సమయంలో తనకు ఎదురైన చేదు అనుభవాలను నటి కృతిక శర్మ భయటపెట్టారు.

Samayam Telugu 22 Nov 2018, 10:42 pm
‘నా డ్రెస్ విప్పేసి మీద పడ్డాడు. సెకన్లలో నన్ను ఆక్రమించేశాడు’ అని మీటూ ఉద్యమంలో భాగంగా క్యాస్టింగ్ డైరెక్టర్ విక్కీ సిదానాపై నటి కృతిక శర్మ ఆరోపించిన విషయం తెలిసిందే. గత నెలలో కృతిక ఇచ్చిన ఫిర్యాదుతో సిదానాపై ఐపీసీ సెక్షన్లు 354, 509 మరియు 406 కింద ముంబై వెర్సోవా పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. MeToo ఉద్యమం తీవ్రరూపం దాల్చిన సమయంలో తనకు ఎదురైన చేదు అనుభవాలను నటి భయటపెట్టారు.
Samayam Telugu Vicky Sidana and Kritika Sharma


తాను పడుకుని అవకాశాలు సంపాదించాలని ఇండస్ట్రీకి రాలేదని, కానీ ఆఫరిస్తే తనకేమిస్తావంటూ విక్కీ సిదానా పదేపదే అడిగేవాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆరేళ్ల కిందట ఇండస్ట్రీలో అవకాశాల కోసం చూస్తున్నప్పుడు విక్కీ సిదానా పరిచయం అయ్యారు. ఛాన్స్‌ అడిగే తన ఇంటికి రమ్మన్నారు. ఆయన భార్య ఉంటారు కదా అని వెళ్లాను.

పని ఉందంటూ వేరే అపార్ట్‌మెంట్‌కు తీసుకెళ్లాడు. గదిలోకి వెళ్లగానే తలుపులేసి నన్ను బెడ్ మీదకు తోశాడు. బలవంతగా నా ప్యాంట్ కిందకు లాగేసి మీద పడి అత్యాచారం చేయబోయడు. ఇతరులతో పడుకుని అవకాశాలు సంపాదించాలని రాలేదని, నీ మీద నమ్మకంతోనే వచ్చానని చెప్పడంతో వదిలి పెట్టాడని నటి ఇటీవల వెల్లడించారు.

కాగా, తనపై వచ్చిన ఆరోపణల్ని విక్కీ సిదానా గతంలోనే ఖండించారు. తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, తన లాయర్లు దీనిపై చట్టపరంగా ముందుకెళ్తారని పేర్కొన్నారు. ఈ క్రమంలో క్యాస్టింగ్‌ డైరెక్టర్‌ సిదానాపై బుధవారం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
Read : MeToo సంబంధిత కథనాల కోసం క్లిక్ చేయండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.