ప్రముఖ నటుడు అరవింద్ స్వామికి తమిళనాడులోని ఆళ్వార్ పేటలో ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ ఉంది. ఆ కంపెనీలో మంగళవారం అగ్నిప్రమాదం సంభవించింది. మూడంతస్తుల భవన సముదాయంలో రెండో అంతస్థులో స్వామికి చెందిన సంస్థ ఉంది. మంగళవారం ఉదయం ఇంకా ఉద్యోగులు విధులకు హాజరు కాని సమయంలో ఒక్కసారిగా దట్టమైన పొగలు రావడం ప్రారంభమయ్యాయి. వెంటనే వాచ్ మెన్ అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించాడు. వారు వచ్చేసరికే వందకు పైగా కంప్యూటర్లు, ఫర్నిచర్ కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఏసీ నుంచి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అవ్వడంతో ప్రమాదం జరిగినట్టు పోలీసుల విచారణలో తేలింది.
తమిళ నటుడి సాఫ్ట్వేర్ సంస్థలో ప్రమాదం
ప్రముఖ నటుడు అరవింద్ స్వామికి తమిళనాడులోని ఆళ్వార్ పేటలో ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ ఉంది.
TNN 2 Mar 2016, 9:00 am