యాప్నగరం

‘దేవ్’ ఫస్ట్ లుక్‌తో అదరగొడుతున్న కార్తీ

కార్తీ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘దేవ్‌’. రజత్‌ రవిశంకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు హీరో సూర్య.

Samayam Telugu 26 Oct 2018, 7:23 pm
కార్తీ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘దేవ్‌’. రజత్‌ రవిశంకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు హీరో సూర్య. చేతిలో హెల్మెట్‌ , వెనకాల రేసింగ్ బైక్‌తో స్టైలిష్‌‌ లుక్‌తో ఆకట్టుకుంటున్నాడు కార్తీ. ఖాకీ చిత్రం తరువాత రకుల్ ప్రీత్ సింగ్‌ మరోసారి కార్తీతో జోడీ కడుతోంది. నిక్కీ గల్రాని మరో కథానాయికగా నటిస్తోంది.
Samayam Telugu dev


ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ పవర్ ఫుల్ రోల్స్‌లో నటిస్తున్న ఈ సినిమాకి హరీష్‌ జయరాజ్‌ సంగీతం అందిస్తున్నారు. చెన్నై, హైదరాబాద్ , ముంబై , హిమాలయాస్ వంటి ప్రదేశాల్లో తెరకెక్కిన ఈ సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది. ప్రిన్స్‌ పిక్చర్స్‌ బ్యానర్‌‌పై ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు హక్కులను ప్రముఖ నిర్మాత ఠాగూర్ మధు దక్కించుకోగా రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్ సమర్పణలో ప్రేక్షకుల ముందుకు రానుంది. యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాను డిసెంబర్‌లో రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.