యాప్నగరం

శ్రీదేవి మృతి: ఫోరెన్సిక్ నివేదిక ఏం చెబుతోందంటే..

శ్రీదేవి మృతికి సంబంధించిన ఫోరెన్సిక్ నివేదికను డాక్టర్ల బృందం విడుదల చేసింది. మరికొద్ది సేపట్లో శ్రీదేవి పార్థీవదేహం ముంబై చేరుకోనుంది.

TNN 26 Feb 2018, 5:17 pm
శ్రీదేవి మృతికి సంబంధించి ఎలాంటి అనుమానాలు లేవని దుబాయ్ అధికారులు వెల్లడించారు. శ్రీదేవి మృతికి సంబంధించిన ఫోరెన్సిక్ నివేదికను డాక్టర్ల బృందం విడుదల చేసింది. ప్రమాదవశాత్తూ బాత్ టబ్‌లో పడిపోవడం వల్లే శ్రీదేవి మరణించినట్లు ఫోరెన్సిక్ నివేదిక ద్వారా తెలుస్తోందని యూఏఈ ఆరోగ్య శాఖ తెలిపింది. అయితే.. ఆమె బాత్ టబ్‌లో పడిపోవడానికి ముందు గుండెపోటుకు గురైందా, లేదా అనే అంశంపై నివేదికలో స్పష్టత లేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Samayam Telugu forensic report says sridevi died of heart attack in dubai
శ్రీదేవి మృతి: ఫోరెన్సిక్ నివేదిక ఏం చెబుతోందంటే..


పరీక్షల అనంతంర శ్రీదేవి భౌతికకాయాన్ని దుబాయ్ అధికారులు ఆమె కుటుంబానికి అప్పగించారు. శ్రీదేవి భౌతికకాయానికి మరోసారి పోస్టుమార్టం చేయనున్నారనే వార్తలను అధికారులు కొట్టిపారేశారు. మరికొద్దిసేపట్లో ఆమె పార్థీవదేహాన్ని ముంబైకి తరలించనున్నారు. ముంబైలోని అనిల్ కపూర్ నివాసానికి ఇప్పటికే సెలబ్రిటీలు పెద్ద ఎత్తున చేరుకున్నారు.
#FLASH Forensic report says, #Sridevi died from accidental drowning (Source: UAE's Gulf News) pic.twitter.com/eWXdw1p1ZL — ANI (@ANI) February 26, 2018
అందాల తార శ్రీదేవిది సహజ మరణం కాదంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని డాక్టర్ల నివేదిక స్పష్టం చేస్తోంది. శ్రీదేవి మరణించి 36 గంటలు పూర్తవుతున్నా.. ఆమె భౌతికకాయాన్ని కుటుంబసభ్యులకు అప్పగించకపోవడం అనేక అనుమానాలకు తావిచ్చింది. దీంతో అతిలోక సుందరి మృతిపై అనేక పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

సహజంగా ఎవరైనా పేషెంట్‌ ఆసుపత్రికి తరలించేటప్పటికే మరణిస్తే.. అలాంటి సందర్భాల్లో మృతదేహానికి పరీక్షలు నిర్వహించడం తదితర ప్రక్రియల్లో క్లిష్టత కారణంగా జాప్యం జరుగుతుందని అధికారులు తెలిపారు. ఇతర దేశాలకు సంబంధించిన వారి విషయంలో ఈ ప్రక్రియ మరింత ఆలస్యం అవుతుందని, అందువల్లే శ్రీదేవి విషయంలో ఇంత సమయం పడుతోందని వెల్లడించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.