యాప్నగరం

కొత్త నటులు కావాలి.. నిఖిల్‌తో కలసి నటిస్తారా?

యువ హీరో నిఖిల్ వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. విభిన్నమైన కథలు ఎంచుకుంటూ టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు.

TNN 16 Jul 2017, 11:38 am
యువ హీరో నిఖిల్ వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. విభిన్నమైన కథలు ఎంచుకుంటూ టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. అందుకే ఇప్పుడు నిర్మాతలు అతనితో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. తాజాగా నిఖిల్ కొత్త సినిమా ప్రారంభమైంది. ఎ.కె ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా శరణ్‌ కొప్పిశెట్టి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇది కాలేజ్ నేపథ్యంలో సాగే కథ అని నిఖిల్ వెల్లడించాడు. అలాగే తనతోపాటు వెండితెరపై కనిపించడానికి కొత్త నటీనటులు కావాలని ట్వీట్ చేశాడు.
Samayam Telugu fresh cast selections for nikhil new movie need 8 guys and 3 girls
కొత్త నటులు కావాలి.. నిఖిల్‌తో కలసి నటిస్తారా?


తన కొత్త సినిమాలో తనతోపాటు నటించేందకు ఎనిమిది మంది అబ్బాయిలు, ముగ్గరు అమ్మాయిలు కావాలని ఓ పోస్టర్‌ను నిఖిల్ ట్వీట్ చేశాడు. ఆ పోస్టర్‌లో కారుపై నిఖిల్ కూర్చున్నాడు. మిగిలన వారు రంగురంగులుగా కనిపిస్తున్నారు. ఆ రంగుల భాగంలో కొత్త నటులను నింపబోతున్నారు. ఆసక్తి ఉన్నవారు వెంటనే తమ ప్రొఫైల్‌ను అప్‌లోడ్ చేసుకోవాలని ఓ వెబ్‌సైట్ అడ్రస్ కూడా ఇచ్చారు. మీకు నిఖిల్‌తో కలసి నటించాలని ఉంటే.. మీ వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉన్నట్లయితే వెంటనే www.celeb-zone.comకి లాగ్ ఇన్ అవ్వండి, లేదా apply@celeb-zone.comకి మీ ప్రొఫైల్‌ను మెయిల్ చేయండి.
Who all want to b On this Poster with me?🤗 Acting in this Fun College Film Produced by @AnilSunkara1 on AK Entertainments. #AK11 #Nikhil15 pic.twitter.com/o8zzRhjxIY — Nikhil Siddhartha (@actor_Nikhil) July 15, 2017

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.