యాప్నగరం

హీరోగా వస్తున్న జనార్ధన్ రెడ్డి తనయుడు...!

ఒక తెలుగు దర్శకుడు రూపొందించబోయే సినిమాతోనే జనార్ధన్ రెడ్డి తనయుడు హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడని సమాచారం.

TNN 5 Jun 2017, 2:33 pm
కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ బ్యారన్ గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడని ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి. గత కొన్ని రోజులుగా ఈ ప్రచారం సాగుతోంది. ప్రత్యేకించి జనార్ధన్ రెడ్డి కూతురు వివాహం దగ్గర నుంచి, కొడుకు కిరిటీ రెడ్డి సినిమాల్లోకి రానున్నాడనే ప్రచారం మొదలైంది. ఈ నేపథ్యంలో ఊహాగానాలను నిజం చేస్తూ తనయుడిని హీరోగా ఇంట్రడ్యూస్ చేయడానికి కథను ఎంపిక చేసే పనిలో ఉన్నారట జనార్ధన్ రెడ్డి.
Samayam Telugu gaali to introduce his son as movie hero
హీరోగా వస్తున్న జనార్ధన్ రెడ్డి తనయుడు...!


ఒక తెలుగు దర్శకుడు రూపొందించబోయే సినిమాతోనే జనార్ధన్ రెడ్డి తనయుడు హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడని సమాచారం. తనయుడిని పరిచయం చేసే సినిమాను కన్నడ, తెలుగు భాషల్లో రూపొందించాలని జనార్ధన్ రెడ్డి భావిస్తున్నారట. జనార్ధన్ రెడ్డి కూతురు బ్రహ్మణి వివాహ ఆహ్వాన పత్రిక ద్వారా తమ అభినయ కలను చాటుకుంది ఆ కుటుంబం. వీడియో రూపంలోని ఆ ఆహ్వాన పత్రికలో జనార్ధన్ రెడ్డి కుటుంబీకులంతా కనిపించారు.

ఇది వరకూ జనార్ధన్ రెడ్డి ఒకటీ అర కన్నడ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. కన్నడలో ఉపేంద్ర హీరోగా రూపొందిన ఒక సినిమాను ‘బుద్ధిమంతుడు’ పేరుతో తెలుగులో విడుదల చేశారాయన.

ఇక కన్నడ రాజకీయ నేతల తనయులు హీరోలుగా రావడం కూడా కొత్తేమీ కాదు. ఇటీవలే కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ కన్నడ, తెలుగు సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. త్వరలోనే జనార్ధన్ రెడ్డి తన లక్ ను పరీక్షించుకోనున్నాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.