యాంగ్రీ యంగ్ మెన్ డా.రాజశేఖర్ కెరీర్లోనే 25 కోట్ల భారీ బడ్జెట్తో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ `పిఎస్వి గరుడవేగ 126.18ఎం`. చందమామ కథలు, గుంటూరు టాకీస్ చిత్రాల దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. గతంలో చందమామ కథలు చిత్రానికి గానూ ఆయనకు జాతీయ అవార్డ్ లభించిన విషయం తెలిసిందే.
రాజశేఖర్ గత చిత్రాలు అంకుశం, మగాడు వంటి చిత్రాల్లో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా నటించి మెప్పించడంతో ఈ సినిమాపై ప్రారంభం నుండి భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా.. గరుడవేగ 126.18 మూవీ ఓవర్సీస్లో వాల్పోస్టర్ సినిమా అనే డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఫ్యాన్సీ రేటుతో హక్కులను సొంతం చేసుకుంది.
పూజా కుమార్ రాజశేఖర్ సరసన గృహిణి పాత్రలో నటిస్తుండగా, సన్నిలియోన్ ఇందులో స్పెషల్ సాంగ్ చేస్తుంది. శ్రద్ధాదాస్ జర్నలిస్ట్ పాత్రలో నటిస్తుండగా.. నాజర్, పోసాని కృష్ణమురళి, అలీ, పృథ్వీ, షాయాజీ షిండే, అవసరాల శ్రీనివాస్, శత్రు, సంజయ్ స్వరూప్, రవివర్మ, ఆదర్శ్, చరణ్ దీప్, రవి రాజ్ తదితరులు నటిస్తున్నారు.