యాప్నగరం

నేడే విడుదల: గౌతమిపుత్ర శాతకర్ణి ఆడియో

నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రతిష్ఠాత్మక 100 చిత్రం ' గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి' పాటలు సోమవారం విడుదల కానున్నాయి. ఈ చిత్రానికి చిరంతన్ భట్ సంగీతం సమకూర్చారు. సినిమా ఆడియో వేడుక తిరుప‌తిలోని...

TNN 26 Dec 2016, 1:18 pm
నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రతిష్ఠాత్మక 100 చిత్రం ' గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి' పాటలు సోమవారం విడుదల కానున్నాయి. ఈ చిత్రానికి చిరంతన్ భట్ సంగీతం సమకూర్చారు. సినిమా ఆడియో ఆవిష్కరణను క‌లియుగ దైవం శ్రీ తిరుమ‌ల వేంక‌టేశ్వ‌రుడి పాదాల చెంత జరపనున్నారు. ఆడియో వేడుక ఈ సాయంత్రం తిరుప‌తిలోని శ్రీ పండిట్ జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రు మున్సిప‌ల్ హైస్కూల్‌లో జ‌ర‌గ‌నుంది.
Samayam Telugu gautamiputra satakarni audio launch in tirupati
నేడే విడుదల: గౌతమిపుత్ర శాతకర్ణి ఆడియో

ఈ వేడుక‌కు కేంద్ర‌మంత్రి వెంక‌య్య‌నాయుడు, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు ముఖ్య అతిథులుగా హాజ‌ర‌వుతున్నారు. ఆడియో విడుదలను తెలియజేస్తూ ప్రత్యేక డిజిటల్ వీడియో ఆహ్వాన పత్రికను విడుదల చేశారు.



నేషనల్ అవార్డ్ విన్నర్ జాగర్లమూడి రాధాకృష్ణ (క్రిష్) దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ టైటిల్ పాత్ర పోషిస్తుండగా హేమామాలిని, శ్రియ, క‌బీర్ బేడి త‌దిత‌రులు ముఖ్యపాత్రల్లో న‌టిస్తున్నారు. జనవరి 13న సంక్రాంతి కానుకగా ' గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి' విడుదల కాబోతుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.