యాప్నగరం

అమెరికాలో ‘గౌతమీ పుత్ర’ వసూళ్లు

‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమా గురువారం విడుదలై మంచి టాక్ సంపాదించుకుంది.

TNN 13 Jan 2017, 3:08 pm
హీరో బాలకృష్ణ వందో సినిమా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమా గురువారం విడుదలై మంచి టాక్ సంపాదించుకుంది. ఇండియాలోనే కాకుండా అమెరికాలో కూడా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది గౌతమీ పుత్ర. అమెరికాలో బాలయ్య వందో సినిమా భారీ వసూళ్ల దిశగా దూసుకెళ్తోందని సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. తొలిరోజు 3,62,820 డాలర్లు వసూలు చేసిందని ట్వీట్‌లో పేర్కొన్నారు. మన కరెన్సీలో దాదాపు రెండున్నర కోట్ల రూపాయల దాకా వసూలు చేసింది. తిరుగులేని చక్రవర్తి గౌతమిపుత్ర శాతకర్ణి జీవిత కథతో నిర్మించిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక థియేటర్లలో ప్రదర్శింపబడుతోంది.
Samayam Telugu gautamiputra satakarni us box office collection
అమెరికాలో ‘గౌతమీ పుత్ర’ వసూళ్లు


తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.