యాప్నగరం

గీతా గోవిందం: వాట్ ది F** దేవరకొండా.. ఏంటా పాట?

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ పాట పాడే ముచ్చటను కూడా తీర్చేసుకున్నారు. ‘అర్జున్ రెడ్డి’ చిత్రంతో స్టార్ హీరోగా మారిన ఈ యంగ్ హీరో ప్రస్తుతం ‘గీత గోవిందం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

Samayam Telugu 26 Jul 2018, 8:31 pm
క్రేజీ హీరో విజయ్ దేవరకొండ పాట పాడే ముచ్చటను కూడా తీర్చేసుకున్నారు. ‘అర్జున్ రెడ్డి’ చిత్రంతో స్టార్ హీరోగా మారిన ఈ యంగ్ హీరో ప్రస్తుతం ‘గీత గోవిందం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ చిత్రంలో దేవరకొండ సరసన ‘ఛలో’ ఫేం రష్మిక మండాన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. గీతా ఆర్ట్స్‌లో ‘శ్రీరస్తు శుభమస్తు’ వంటి ఫ్యామిటీ ఎంటర్‌‌టైనర్‌తో విజయం అందుకున్న పరశురాం (బుజ్జి) ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. జీఏ2 బ్యానర్‌లో అల్లు అరవింద్ సమర్పిస్తుండగా.. బన్నీ వాసు నిర్మించారు. ఈ చిత్రాన్ని ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా గురువారం నాడు ‘గీతా గోవిందం’ నుండి సెకండ్ లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాటను స్వయంగా విజయ్ దేవరకొండ ఆలపించడం విశేషం.
Samayam Telugu Geetha Govindam


ఇటీవల ఈ చిత్రం నుండి విడుదలైన తొలిపాట ‘ఇంకేం కావాలే’ యూట్యూబ్‌ను షేక్ చేస్తూ 20 మిలియన్ వ్యూస్‌ను క్రాస్ చేసి 2019లోనే మ్యూజికల్ హిట్ సాంగ్‌గా నిలిచింది. గోపీసుందర్ అద్భుతమైన మెలోడీ ట్యూన్ అందించగా.. అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించారు. ఈ సూపర్ హిట్ సాంగ్‌ను సిడ్ శ్రీరామ్ అద్భుతంగా ఆలపించారు. ఇక ఈ సాంగ్‌కు సూపర్ రెస్పాన్స్ రావడంతో ‘గీతా గోవిందం’ పాటల కోసం ప్రేక్షకుల ఎదురు చూస్తున్న సందర్భంలో ‘వాట్ ది ఎఫ్’ సాంగ్ పాడుతూ.. ఫ్రస్ట్రేటెడ్‌ సింగర్‌ అవతారం ఎత్తాడు విజయ్ దేవరకొండ.

‘అర్జున్ రెడ్డి’ చిత్రం విడుదలకు ముందే ‘వాట్ ది ఎఫ్’ అనే పదాన్ని విరివిగా ఉపయోగించి బాగా ప్రచారం పొందారు విజయ్ దేవరకొండ. ఇప్పుడు ‘గీతా గోవిందం’లోనూ తనకు అచ్చొచ్చిన ‘ఎఫ్’ అక్షరాన్ని హైలైట్ చేస్తూ పాట పాడేశాడు దేవరకొండ.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.