యాప్నగరం

ఐదేళ్ల అవార్డుల పండగ ఒకేసారి

ఆంధ్రప్రదేశ్ ఫ్రభుత్వం 2014, 2015, 2016 సంవత్సరాలకిగాను నంది అవార్డుల కమిటీలని ప్రకటించింది.

TNN 11 Aug 2017, 5:22 pm
ఆంధ్రప్రదేశ్ ఫ్రభుత్వం 2014, 2015, 2016 సంవత్సరాలకిగాను నంది అవార్డుల కమిటీలని ప్రకటించింది. 2014 సంవత్సరానికిగాను సీనియర్ నటుడు గిరిబాబు, 2015 సంవత్సరానికిగాను సినీ నటి, నిర్మాత, ప్రస్తుత సెన్సార్ బోర్డ్ సభ్యురాలు జీవిత రాజశేఖర్, 2016 సంవత్సరానికిగాను ప్రముఖ నిర్మాత పోకూరి రవి బాబులని ఎంపిక చేస్తూ గురువారమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.
Samayam Telugu giri babu jeevitha rajashekar to head nandi award committees
ఐదేళ్ల అవార్డుల పండగ ఒకేసారి


ఇదిలావుంటే, గత మూడేళ్లకిగాను ఎన్టీఆర్ నేషనల్ అవార్డ్, నాగిరెడ్డి-చక్రపాణి అవార్డ్, రఘుపతి వెంకయ్య అవార్డ్, బీఎన్ రెడ్డి అవార్డ్ కమిటీలకి సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నేతృత్వం వహించనున్నట్టు ఏపీ ప్రభుత్వం ఈ ఆదేశాల్లో స్పష్టంచేసింది.

నంది అవార్డులని ప్రారంభించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ అవార్డుల ప్రదానోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్టు రాష్ట్ర సినిమా, టీవీ, థియేటర్‌ అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌ అంబికా కృష్ణ తెలిపారు. 2011, 2012 సంవత్సరాలకి సంబంధించి సినిమాలను, నటీనటులు, సాంకేతిక నిపుణులని ఎంపిక చేసినప్పటికీ వారికి అప్పట్లో అవార్డులు ప్రదానం చేయలేదు కనుక ఈ ఐదేళ్ల అవార్డులను ఒకేసారి ఇవ్వాలని నిర్ణయించినట్లు అంబికా కృష్ణ స్పష్టంచేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.