యాప్నగరం

రచ్చరేపిన సన్నీలియోన్ కండోమ్ యాడ్

తెరపై మితిమీరి అందాలను ఆరబోస్తూ గతంలో వివాదాల్లో చిక్కుకున్న సన్నీ లియోన్

TNN 1 Mar 2017, 5:03 pm
వెండితెరపై అందాలు ఆరబోస్తూ.. గత కొంతకాలంగా కుర్రకారు గుండెల్లో సెగలు రేపుతున్న బాలీవుడ్ నటి సన్నీ లియోన్ మళ్లీ రచ్చకెక్కింది. ఇప్పటి వరకు సినిమాల్లోని సన్నివేశాలతో వివాదాలు రేపిన సన్నీ.. ఈ సారి ఓ కండోమ్ యాడ్ ద్వారా వార్తల్లో నిలిచింది. గోవాలోని మహిళా సంఘం ఒకటి సన్నీ యాడ్‌ను నిలిపివేయాలంటే ఏకంగా ఆ రాష్ట్ర మహిళా కమిషన్‌ని ఆశ్రయించింది.
Samayam Telugu goa womens demand on sunny condom ad
రచ్చరేపిన సన్నీలియోన్ కండోమ్ యాడ్


కండోమ్ యాడ్‌లో సన్నీ లియోన్ గతంలో కూడా నటించింది. కానీ.. సదరు కంపెనీ వారు ఈ సారి ఓ అడుగు ముందుకేసి ప్రచారంలో భాగంగా ప్రభుత్వ రవాణ సంస్థ బస్సుల్లో, ప్రధాన కూడళ్లలో పెద్ద పెద్ద పోస్టర్ల‌ను అతికించారు. దీంతో మండిపడ్డ మహిళా సంఘాలు అసభ్యంగా ఉన్న ఆ యాడ్‌ను వెంటనే నిషేధించాలని డిమాండ్ చేస్తున్నాయి. బాలీవుడ్‌లో సినిమాలు చేయకముందు సన్నీ లియోన్ నీలి చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.