గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్స్ చరిత్రలో తనకంటూ ఓ పేజీ క్రియేట్ చేసుకుందీ హాలీవుడ్ మూవీ 'ల ల ల్యాండ్'. డామియెన్ చేజెల్ డైరెక్ట్ చేసిన ఈ లవ్ స్టోరీ వివిధ కేటగిరీలలో కలిపి ఏకంగా 7 అవార్డులు దక్కించుకుని గోల్డెన్ గ్లోబ్స్ చరిత్రలో అత్యధిక సంఖ్యలో అవార్డులు గెలుచుకున్న సినిమాగా రికార్డ్ నమోదు చేసుకుంది. గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్స్ స్థాపించిన ఇన్నేళ్ల కాలంలో 7 అవార్డులు సొంతం చేసుకున్న మొదటి సినిమా ఇదే కావడం విశేషం. గతంలో 'వన్ ఫ్లూ ఓవర్ ద కకూస్ నెస్ట్', 'మిడ్ నైట్ ఎక్స్ప్రెస్' అనే రెండు చిత్రాల పేరిటే ఈ రికార్డు ఉండేది. ఈ రెండు సినిమాలు వివిధ కేటగిరీలలో కలిపి మొత్తం 6 అవార్డులు దక్కించుకోగా తాజాగా ల ల ల్యాండ్ చిత్రం 7 అవార్డులు సొంతం చేసుకుని ఆ రికార్డుని బద్ధలు కొట్టింది.
ల ల ల్యాండ్ చిత్రం దక్కించుకున్న 7 అవార్డుల వివరాలు:
ల ల ల్యాండ్ నటుడు ర్యాన్ గోస్లింగ్ ఉత్తమ నటుడు అవార్డ్, ఇదే చిత్రంలో హీరోయిన్గా నటించిన ఎమ్మా స్టోన్ ఉత్తమ నటిగా అవార్డులు దక్కించుకున్నారు. ఉత్తమ దర్శకత్వం, స్క్రీన్ ప్లే కేటగిరీలు రెండూ ఈ సినిమా డైరెక్టర్ డామియెన్ ఛేజెల్ సొంతం అయ్యాయి. ఒరిజినల్ స్కోర్ డిపార్ట్మెంట్ కేటగిరీలో జస్టిన్ హర్విజ్, ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఈ చిత్రంలోని 'సిటీ ఆఫ్ స్టార్స్' పాటకు అవార్డులు దక్కాయి.