యాప్నగరం

గోపీచంద్ కొత్త సినిమా సంగతేంటి?

మాస్ యాక్షన్ హీరో గోపీచంద్, హ్యాట్రిక్ డైరెక్టర్ సంపత్ నందిల క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం. ఇప్పటికే మూడు షెడ్యూల్స్ పూర్తి చేసుకొని నాలుగో షెడ్యూల్‌ను ప్రారంభించుకోనుంది.

TNN 18 Jan 2017, 4:27 pm
మాస్ యాక్షన్ హీరో గోపీచంద్, హ్యాట్రిక్ డైరెక్టర్ సంపత్ నందిల క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం. ఇప్పటికే మూడు షెడ్యూల్స్ పూర్తి చేసుకొని నాలుగో షెడ్యూల్‌ను ప్రారంభించుకోనుంది. ఈ చిత్రానికి ఇంకా పేరు ఖరారు చేయలేదు. శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకంపై తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ నాలుగో షెడ్యూల్‌లో కొన్ని కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించనున్నారు.
Samayam Telugu gopichand and sampath nandi prestigious project in last fourth schedule
గోపీచంద్ కొత్త సినిమా సంగతేంటి?


ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు జె.భగవాన్-జె.పుల్లారావులు మాట్లాడుతూ.. "థాయ్ ల్యాండ్, హైద్రాబాద్ లో మూడు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. ఇక నేటి నుంచి మొదలై ఫిబ్రవరి 20 వరకూ జరగనున్న నాలుగో షెడ్యూల్ లో హీరోహీరోయిన్లు గోపీచంద్-రాశీఖన్నా-కేతరీన్ లపై కాంబినేషన్‌లో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలతోపాటు పతాక సన్నివేశాల చిత్రీకరణ పూర్తి చేసేందుకు దర్శకుడు సంపత్ నంది సన్నాహాలు చేసుకొంటున్నారు.

రామ్-లక్ష్మణ్‌ల నిర్వహణలో చిత్రీకరించబడనున్న ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయన్నారు. ఇక సంపత్ నంది యాక్షన్ సీన్స్‌తోపాటు ఎమోషనల్ సీన్స్‌ను హ్యాండిల్ చేసిన విధానం, ఆ సన్నివేశాల్ని మా సినిమాటోగ్రాఫర్ సౌందర్ రాజన్ తన కెమెరాలో బంధించిన తీరు ప్రేక్షకుల్ని విశేషంగా అలరిస్తుంది.

గోపీచంద్ ఈ సినిమాలో సూపర్ స్టైలిష్‌‌గా కనిపించనున్నారు. సంపత్ నంది మార్క్ పవర్ ఫుల్ టైటిల్ తోపాటు గోపీచంద్ స్టైలిష్ లుక్‌ను కూడా త్వరలో విడుదల చేస్తాం. అత్యుత్తమ సాంకేతిక నైపుణ్యంతో తెరకెక్కుతోన్న ఈ చిత్రం మా బ్యానర్ విలువను పెంచే విధంగా ఉంటుంది. ఇకపోతే.. ఈ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్‌ను వేసవి కానుకగా విడుదల చేసేందుకు సన్నద్ధమవుతున్నాం" అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.