యాప్నగరం

కొత్త దర్శకుడిని నమ్ముకున్న గోపీచంద్

కమర్షియల్ హీరోగా మంచి మార్కెట్‌ను సొంతం చేసుకున్న గోపీచంద్‌కు ఇప్పుడు అంతగా కలిసిరావడంలేదు.

TNN 28 Oct 2017, 2:04 pm
కమర్షియల్ హీరోగా మంచి మార్కెట్‌ను సొంతం చేసుకున్న గోపీచంద్‌కు ఇప్పుడు అంతగా కలిసిరావడంలేదు. ఈ మధ్య వచ్చిన ఆయన సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా పడ్డాయి. ప్రస్తుతం ‘ఆక్సిజన్’ విడుదలకు సిద్ధమవుతోంది. అయితే తన తదుపరి సినిమాకి కొత్త దర్శకుడ్ని ఎంపిక చేసుకున్నాడు గోపీచంద్. చక్రవర్తి అనే దర్శకుడిని ఆయన పరిచయం చేయబోతున్నాడు. ‘జై లవ కుశ’ వంటి బ్లాక్ బస్టర్ మూవీకి చక్రి స్క్రిప్టు రైటర్‌గా పనిచేశారు. నవంబర్‌లో ఈ సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించి, డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టనున్నారు.
Samayam Telugu gopichand to work with debut director
కొత్త దర్శకుడిని నమ్ముకున్న గోపీచంద్


ఈ సినిమాలో ఇప్పటివరకు చేయని కొత్త పాత్రలో గోపీచంద్ కనిపిస్తారట. కె.కె.రాధామోహన్ నిర్మాణంలో ఈ కొత్త సినిమా సెట్స్ పైకి రానుంది. గతంలో రవితేజతో ‘బెంగాల్ టైగర్’ సినిమాను రాధామోహన్ నిర్మించారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలను అధికారికంగా వెల్లడించబోతున్నారు. ప్రస్తుతం ‘ఆక్సిజన్’ సినిమా రిలీజ్ కోసం గోపీచంద్ వెయిట్ చేస్తున్నాడు. ఈ సినిమా నవంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.