యాప్నగరం

వచ్చే నెలలో 'ఆక్సిజన్' విడుదల

గోపీచంద్‌ హీరోగా రాశిఖన్నా, అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్లుగా ఎ.ఎం.జోతికృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'ఆక్సిజన్‌. ఇప్ప‌టి వ‌ర‌కు సినిమా 90 శాతం చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంది...

TNN 15 Aug 2016, 1:38 pm
గోపీచంద్‌ హీరోగా రాశిఖన్నా, అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్లుగా ఎ.ఎం.జోతికృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'ఆక్సిజన్‌. ప్ర‌స్తుతం ఈ సినిమా డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. ఈ సందర్భంగా ఈ సినిమా నిర్మాత ఎస్‌.ఐశ్వ‌ర్య మాట్లాడుతూ ‘’ఇప్ప‌టి వ‌ర‌కు సినిమా 90 శాతం చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంది. అలాగే చిత్రీక‌ర‌ణ‌కు స‌మాంత‌రంగా డబ్బింగ్ కార్య‌క్ర‌మాలు కూడా జ‌రుగున్నాయి. ఇప్ప‌టి వర‌కు ఎవ‌రూ ట‌చ్ చేయ‌ని డిఫ‌రెంట్ పాయింట్‌తో సినిమా చేస్తున్నాం. సినిమాపై మంచి అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇటీవల విడుదల చేసిన సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రముఖ నటుడు జగపతి బాబు కీలకపాత్రలో నటిస్తున్నారు. ఆయన పాత్ర చాలా హైలైట్ గా ఉంటుంది. అలాగే ప్రముఖ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా సంగీతం సినిమాకు హైలైట్ గా నిలవనుంది. సెప్టెంబ‌ర్ నెల‌లో ఆడియో విడుద‌ల చేసి అదే నెల‌లో సినిమాను కూడా ప్రేక్ష‌కులు ముందుకు తీసుకు రావ‌డానికి ప్లాన్ చేస్తున్నాం`` అని చెప్పారు.
Samayam Telugu gopichands oxygen movie is going to be relased in september
వచ్చే నెలలో 'ఆక్సిజన్' విడుదల



తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.