యాప్నగరం

రూ. 25 కోట్ల క్లబ్‌లో గోపీచంద్!

గోపీచంద్ ద్విపాత్రాభినయం చేసిన తాజా సినిమా ‘గౌతమ్‌నంద’. జులై 28న విడుదలైన ఈ సినిమాపై నెగిటివ్ టాక్ వినిపించినా ఆ ప్రభావం కలెక్షన్లపై పడలేదు.

TNN 6 Aug 2017, 1:30 pm
గోపీచంద్ ద్విపాత్రాభినయం చేసిన తాజా సినిమా ‘గౌతమ్‌నంద’. జులై 28న విడుదలైన ఈ సినిమాపై నెగిటివ్ టాక్ వినిపించినా ఆ ప్రభావం కలెక్షన్లపై పడలేదు. విడుదలైన 10 రోజుల్లోనే ఈ సినిమా రూ. 25 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. గోపీచంద్ కెరీర్‌లోనే అత్యధిక గ్రాస్ వసూలు చేసిన సినిమాగా ‘గౌతమ్‌నంద’ నిలిచింది. ఈ మేరకు చిత్ర యూనిట్ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. ‘గోపీచంద్ కెరీర్‌లోనే అతిపెద్ద గ్రాసర్. తొలి వారం రూ. 25 కోట్లు’ అని రాసున్న పోస్టర్‌ను సినీ విశ్లేషకులు ట్విట్టర్‌ ద్వారా సినీ అభిమానులకు పంచుతున్నారు.
Samayam Telugu goutham nanda is the biggest grosser in gopichands career
రూ. 25 కోట్ల క్లబ్‌లో గోపీచంద్!

#GouthamNanda - Biggest grosser in #Gopichand 's career.. Minted a gross of ₹ 25 Crs in its first week run.. A film by @IamSampathNandi pic.twitter.com/yXn4Emx9oU — Ramesh Bala (@rameshlaus) August 6, 2017
కాగా, తెలుగు రాష్ట్రాల్లో ‘గౌతమ్‌నంద’ తొలివారం వసూళ్లు బాగానే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో కలిపి తొలివారం రూ. 8.69 కోట్ల షేర్‌ను ఈ సినిమా సాధించింది. సంపత్‌ నంది దర్శకత్వం వహించిన ఈ సినిమాలో గోపీచంద్ సరసన హన్సిక, కేథరిన్ నటించారు. శ్రీబాలాజీ సినీ మీడియా పతాకంపై జె.భగవాన్, జె.పుల్లారావ్ సంయుక్తంగా ‘గౌతమ్‌నంద’ను నిర్మించారు. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.