యాప్నగరం

శాతకర్ణి మూవీ ఎలాఉందో తెలుసా!

ఎన్టీఆర్‌ నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని తండ్రికి తగ్గ తనయుడిగా పౌరాణికం, చారిత్రకం, జానపదం, సోషియో ఫాంటసీ, సాంఘికం ఇలా అన్ని రకాల కథల్లోనూ ఒదిగిపోయిన అరుదైన నటుడు నందమూరి బాలకృష్ణ.

TNN 11 Jan 2017, 8:14 pm
ఎన్టీఆర్‌ నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని తండ్రికి తగ్గ తనయుడిగా పౌరాణికం, చారిత్రకం, జానపదం, సోషియో ఫాంటసీ, సాంఘికం ఇలా అన్ని రకాల కథల్లోనూ ఒదిగిపోయిన అరుదైన నటుడు నందమూరి బాలకృష్ణ. ఈ నందమూరి నటసింహం వందవ చిత్రంగా చారిత్రక కథని ఎంచుకొని, తెలుగు జాతి పరాక్రమాన్ని చాటిచెప్పిన శకపురుషుడు ‘గౌతమిపుత్ర శాతకర్ణి’గా ప్రేక్షకులముందుకు రాబోతున్నాడు. క్రిష్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా రేపు (గురువారం) విడుదల కానుండగా.. ఇప్పటికే ఈ మూవీని టాలీవుడ్‌ ప్రముఖులతో పాటు నందమూరి ఫ్యామిలీ కూడా వీక్షించినట్లు తెలుస్తోంది.
Samayam Telugu gouthamiputra satakarni special show for balayya family
శాతకర్ణి మూవీ ఎలాఉందో తెలుసా!


గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా ఎప్పుడెప్పుడా అని సాధారణ ప్రేక్షకుల నుండి సెలబ్రిటీల వరకూ ఎదురు చూస్తున్నారు. క్రిష్ తెరకెక్కించిన ఈ సినిమా ట్రైలర్‌కి రెస్పాన్స్ అదిరిపోవడంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. అయితే మంగళవారం రాత్రి బాలయ్య ఫ్యామిలీకోసం రామానాయుడు స్టుడియోలో గౌతమిపుత్ర శాతకర్ణి ప్రీ రిలీజ్ షో వేశారని సమాచారం. ఈ స్పెషల్ షోకి బాలయ్యతో పాటు ఆయన సతీమణి వసుంధర, అల్లుడు నారా లోకేష్ -బ్రాహ్మణి దంపతులతోపాటు, మరికొంత మంది సన్నిహితులు శాతకర్ణి సినిమాని ప్రత్యేకంగా చూశారట.

శాతకర్ణి సినిమా చూస్తున్నంత సేపు చాలా థ్రిల్ ఫీల్ అయ్యామని, ఊహించిన దానికంటే సినిమా అద్భుతంగా ఉందంటూ బాలయ్యని చప్పట్లతో అభినందించారట. క్రిష్ తెరకెక్కించిన యుద్ధ సన్నివేశాలు సినిమాకే హైలైట్స్ అని, క్లైమాక్స్‌లో బాలయ్య నటన పీక్స్ చేరినట్టు సన్నిహితులు చెప్పున్నారు. బాలయ్యతో శ్రియా పోటీపడి నటించిందని, తల్లిపాత్రలో హేమమాలిని ఆకట్టుకున్నారనే టాక్ వినిపిస్తోంది.

మొత్తానికి సంక్రాంతి బరిలో నిలిచిన భారీ సినిమాలు ఖైదీ నెం.150, గౌతమి పుత్ర శాతకర్ణి లకు మంచి టాక్ రావడంతో టాలీవుడ్‌కి మంచిరోజులొచ్చాయనే అనుకోవాలి. అయితే మరికొన్ని గంటల్లో గౌతమిపుత్ర శాతకర్ణికి ప్రేక్షకుడి అంతిమ తీర్పు ఏవిధంగా ఉంటుందో తేలిపోతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.