యాప్నగరం

సినిమా పేరు కనిపెట్టిన వారికి తాప్సీ బంపర్ ఆఫర్..!

బాలీవుడ్‌లో వరస అవకాశాలతో దూసుకెళుతున్న యువ కథానాయిక ‘తాప్సీ’ మధ్యమధ్యలో తెలుగు ప్రేక్షకులను పకరిస్తూనే ఉంది..

TNN 23 May 2017, 4:07 pm
బాలీవుడ్‌లో వరస అవకాశాలతో దూసుకెళుతున్న యువ కథానాయిక ‘తాప్సీ’ మధ్యమధ్యలో తెలుగు ప్రేక్షకులను పకరిస్తూనే ఉంది. ‘పింక్’ సినిమా ద్వారా తనలో అందంతో పాటు అభినయం కూడా ఉందని నిరూపించుకున్న ఈ అమ్మడు ఇటీవలే తెలుగులో ‘ఘాజి’ సినిమాతోనూ మెప్పించింది. ప్రస్తుతం లండన్‌లో జుద్వా-2 షూటింగ్ పూర్తి చేసుకున్న తాప్సీ.. త్వరలోనే మరో తెలుగు సినిమాతో మన ముందుకు రానుంది. అయితే.. 70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా పేరును చిత్ర బృందం ఇప్పటివరకూ బయట పెట్టలేదు. ఆ చిత్రం పేరు కనిపెట్టినవారికి బంపర్ ఆఫర్ అందిస్తూ.. తాప్సీ తాజాగా ఓ ట్వీట్ చేసింది.
Samayam Telugu guess the title of my next to win a selfie with me says tapsee
సినిమా పేరు కనిపెట్టిన వారికి తాప్సీ బంపర్ ఆఫర్..!

Back on screens in Telugu! Guess the title of my next to WIN a selfie with MEEEE 😁 #FirstLook on May 28. #70mmEntertainments pic.twitter.com/7Jz8ENju7T — taapsee pannu (@taapsee) May 22, 2017


ఇక్కడ కనిపిస్తున్న పోస్టర్‌లో తాప్సి నటిస్తున్న సినిమా పేరు ఉంది. దాన్ని జాగ్రత్తగా పరిశీలించి సినిమా టైటిల్ కనిపెట్టిన వారితో సెల్ఫీ దిగుతా అంటూ తాప్సీ ట్విటర్‌లో పోస్టు చేసింది. ​ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను మే 28న విడుదల చేయనున్నట్లు కూడా తాప్సీ తన ట్వీట్ ద్వారా తెలిపింది. ఇంకెందుకు ఆలస్యం.. ఆ సినిమా పేరేంటో కనిపెట్టి తాప్సీతో సెల్ఫీ దిగే అవకాశాన్ని అందుకోండి మరి!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.