తెలుగు సినిమాతోనే హీరోయిన్ గా మారినా.. కొన్నేళ్లుగా హన్సికకు టాలీవుడ్ తో కొంత గ్యాప్ వచ్చింది. తమిళ సినిమాల మీదే ఎక్కువగా కాన్సన్ ట్రేట్ చేసింది ఈ హీరోయిన్. అయితే అడపాదడపా మాత్రం తెలుగు సినిమాల్లో అగుపిస్తోంది. ఈ క్రమంలో గోపిచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో ‘గౌతమ్నంద’ లో హీరోయిన్ గా నటిస్తోందీమె. ఆ సినిమాకు సంబంధించిన స్టిల్ ఇది.
రెయిన్ సాంగులు అనగానే.. హీరోయిన్ తో చీరలు కట్టించడం టాలీవుడ్ దర్శకుల ప్రత్యేకత. ఈ క్రమంలో హీరోయిన్లను అందంగా చూపించడంలో ప్రత్యేక ప్రావీణ్యాన్ని కలిగిన సంపత్ నంది హన్సికను ఇలా చూపినట్టున్నాడు. అటు మోడ్రన్ డ్రస్సింగ్ ను ఇటు సంప్రదాయ చీరకట్టును మిక్స్ చేసి హన్సికను కొత్తగా ఆవిష్కరించినట్టున్నాడు. చీర కట్టును కొత్తపుంతలు తొక్కించినట్టుగా ఉంది ఈ బ్యూటీ. ఈ డ్రస్సింగ్ పై హన్సిక అభిమానులే కామెంట్లు చేయాలి. ప్రేక్షకులే అభిప్రాయాన్ని చెప్పాలి. అంతకు మించి నో కామెంట్!
మరి ఈ మధ్య తమిళంలో కూడా హన్సిక ఊపు కొంచెం తగ్గింది. అక్కడ అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. ‘గౌతమ్నంద’ తర్వాత హన్సిక మళ్లీ తెలుగులో బిజీ అయిపోతుందేమో చూడాలి.