యాప్నగరం

హన్సిక.. అతడి ప్రేమలో పడిందా?

హన్సిక, శింబుల బ్రేకప్ జరిగి కూడా రెండేళ్లు కావొస్తోంది. ఈ క్రమంలో హన్సిక మళ్లీ ప్రేమలో పడ్డట్టుగా వార్తలు వస్తున్నాయి.

TNN 8 Dec 2017, 11:58 am
ఇది వరకే హన్సిక విషయంలో ఇలాంటి వార్తలు వచ్చాయి. టీనేజ్ ఆరంభంలోనే ఇండస్ట్రీలోకి వచ్చేసి హీరోయిన్ గా స్టార్ అయిపోయిన హన్సిక తమిళ నటుడు శింబు ప్రేమలో పడినట్టుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ విషయాన్ని శింబు కూడా ధ్రువీకరించాడు. అప్పటికే నయనతారతో ప్రేమగ్రంథాన్ని నడిపిన శింబు..ఆమెతో బ్రేకప్ తర్వాత హన్సికతో మొదలుపెట్టాడు. అయితే హన్సిక తనను వదిలేసి వెళ్లిందని ఆ తర్వాత ఇతడు ఆవేదన వ్యక్తం చేశాడు కూడా. ఆ విధంగా తమ మధ్య నడిచిన ప్రేమను ధ్రువీకరించాడు శింబు.
Samayam Telugu hansikaatharva in love
హన్సిక.. అతడి ప్రేమలో పడిందా?


అలా హన్సిక, శింబుల బ్రేకప్ జరిగి కూడా రెండేళ్లు కావొస్తోంది. ఈ క్రమంలో హన్సిక మళ్లీ ప్రేమలో పడ్డట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ సారి కూడా ఈ విషయంలో ఒక హీరో పేరే వినిపిస్తుండం విశేషం. అతడు మరెవరో కాదు తమిళ నటుడు అధర్వ.

ఆ మధ్య బాల దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘పరదేశీ’లో తన నటనతో అదరగొట్టాడు అధర్వ. ఇంతకన్నా చెప్పాలంటే.. తమిళ దివంగత నటుడు మురళీ తనయుడే ఇతడు. తన ప్రత్యేకతను చాటుకుంటూ సాగుతున్నాడు అధర్వ. ఈ క్రమంలో హన్సికకు ఇతడు పడిపోయాడనే టాక్ వినిపిస్తోంది తమిళనాడు నుంచి.

అధర్వ, హన్సికల మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ అంటూ తమిళ పత్రికలు చెబుతున్నాయి. అయితే ఈ ప్రేమ వ్యవహారం గురించి... అధర్వ, హన్సిక ఇంకా స్పందించలేదు.ప్రస్తుతం వీరిద్దరూ కలిసి ఒక సినిమాలో నటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రూమర్ వార్తల్లోకి వచ్చింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.