యాప్నగరం

కథ రెడీ: చిరంజీవి.. ఈ దర్శకుడికి ఛాన్స్ ఇస్తారా?

ఒకవైపు ‘ఉయ్యాలవాడ’ సినిమా సంబంధిత ఏర్పాట్లలో బిజీగా ఉన్నాడు మెగాస్టార్

TNN 29 Jun 2017, 3:33 pm
ఒకవైపు ‘ఉయ్యాలవాడ’ సినిమా సంబంధిత ఏర్పాట్లలో బిజీగా ఉన్నాడు మెగాస్టార్. అలాగే బోయపాటి దర్శకత్వంలో ఒక సినిమాలో చేయనున్నాడనేది ఇది వరకూ ప్రకటించిన అంశమే. ఈ విధంగా చిరంజీవి తదుపరి రెండు సినిమాల విషయంలో స్పష్టత ఉండగా.. ఇప్పుడు చిరంజీవితో సినిమా ఆసక్తిని వ్యక్తబరిచాడు దర్శకుడు హరీష్ శంకర్. ‘డీజే’ సినిమాతో ఉత్సాహం మీదున్న ఈ దర్శకుడు చిరంజీవి కోసం తన దగ్గర ఒక కథ రెడీగా ఉందని ప్రకటించాడు.
Samayam Telugu harish ready for a movie with megastar
కథ రెడీ: చిరంజీవి.. ఈ దర్శకుడికి ఛాన్స్ ఇస్తారా?


పవన్ కల్యాణ్ తో ఇది వరకూ ‘గబ్బర్ సింగ్’ సినిమాతో హిట్టు కొట్టిన హరీష్ శంకర్ మళ్లీ పవన్ తో సినిమా తీస్తారా? అంటే, పవన్ కు తగిన కథ తన దగ్గర లేదని, చిరంజీవి కోసం ఒక కథ రెడీ చేసి పెట్టుకున్నాను అని ఈ దర్శకుడు తెలిపాడు. పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్ అనదగ్గ కథనే తను సిద్ధం చేసుకున్నాను అని హరీష్ పేర్కొన్నాడు.

గ్యాంగ్ లీడర్, దొంగమొగుడు, రౌడీ అల్లుడు... వంటి మెగాస్టార్ సూపర్ హిట్ సినిమాల తరహా కథ ఇది అని వివరించాడు. మరి మెగాస్టార్ కోసం కథ సిద్ధమని హరీష్ బహిరంగ ప్రకటన చేశాడు. చిరంజీవి అవకాశం ఇస్తాడేమో చూడాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.