యాప్నగరం

Pawan Kalyan : పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు అప్డేట్ ఇచ్చేసిన హరీష్ శంకర్

Gabbar Singh - Harish Shankar : గబ్బర్ సింగ్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో హరీష్ శంకర్ చేయనున్న చిత్రం భవదీయుడు భగత్ సింగ్. ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుుతందనే దానిపై డైరెక్టర్ హరీష్ శంకర్ క్లారిటీ ఇచ్చారు.

Samayam Telugu 6 Feb 2022, 10:28 pm
పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో డైనమిక్ డైరెక్టర్ హరీష్ శంకర్ సినిమా చేయబోతున్నారనగానే ఆ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఎందుకంటే పవన్ కల్యాణ్‌తో ‘గబ్బర్ సింగ్’ సినిమా చేసి ట్రెండ్ చేశారు హరీష్. పవన్ అభిమానులకు ఏం కావాలో అన్నీ చక్కగా సమకూర్చి ఆ సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ చేశారు. దీంతో ఈ కాంబినేషన్‌పై మంచి అంచనాలు ఉన్నాయి. దాదాపు దశాబ్దం తర్వాత ఈ కాంబినేషన్ రిపీట్ అవుతుండడంతో పవన్ కల్యాణ్ అభిమానులు త్వరగా సినిమా రావాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వీరి కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న ‘భవదీయుడు భగత్‌సింగ్’ సినిమా అప్డేట్స్ కోసం సోషల్ మీడియాలో ఎంతగానో ఎదురు చూస్తున్నారు. నేరుగా డైరెక్టర్ హరీష్ శంకర్‌ను ట్యాగ్ చేస్తూ అప్డేట్స్ ఇవ్వమని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హరీష్ శంకర్ తాజాగా ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్పారు. ‘భవదీయుడు భగత్‌సింగ్’ పోస్టర్‌తో పాటు ఓ వాయిస్ మెసేజ్‌ను హరీష్ శంకర్ ట్వీట్ చేశారు.
Samayam Telugu భవదీయుడు భగత్ సింగ్
Bhavadeeyudu Bhagat Singh


‘‘హాయ్ గాయ్స్.. చాలామంది భవదీయుడు భగత్‌సింగ్ సినిమా అప్డేట్స్ అడుగుతున్నారు. సినిమాలో టైమింగ్ ఎంత ఇంపార్టెంటో.. సినిమాకు టైమింగ్ కూడా అంతే ఇంపార్టెంట్ అని నమ్ముతాను నేను. అతి త్వరలో అన్ని విషయాలు మీతో పంచుకుంటాను. అన్ని పనులు జరుగుతున్నాయి. మీ సపోర్ట్‌కు, పేషన్స్‌కు థ్యాంక్యూ’’ అని హరీష్ శంకర్ తన వాయిస్ మెసేజ్‌లో పేర్కొన్నారు.

‘భవదీయుడు భగత్‌సింగ్’ సినిమాను ప్రఖ్యాత నిర్మాణ సంస్థ మైత్రీమూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇక ఈ చిత్రానికి కూడా ‘గబ్బర్ సింగ్’ చిత్రానికి సంగీతం అందించిన రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండడం విశేషం. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డేను హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.