యాప్నగరం

నేనెప్పుడూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్‌ని‌ మాత్రమే.. నా తదుపరి ప్రాజెక్ట్ అదే: హరీష్ శంకర్

పవన్ కళ్యాణ్ తిరిగి కెమెరా ముందుకు రావడంతో హరీష్ శంకర్ దర్శకత్వంలో ఆయన సినిమా ఉండనుందనే వార్తలు చూస్తున్నాం. తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో ఈ ఇష్యూపై మరోసారి స్పందించారు డైరెక్టర్ హరీష్.

Samayam Telugu 18 Apr 2020, 8:47 am
ఇటీవలే వరుణ్ తేజ్‌తో 'గద్దలకొండ గణేష్' సినిమా రూపొందించి సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్న హరీష్ శంకర్ తన తదుపరి సినిమాను పవన్ కళ్యాణ్‌తో చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ వార్తలపై స్పందించిన హరీష్.. అందులో నిజం లేదని చెప్పినప్పటికీ ఆ రూమర్స్ ఆగడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఆంగ్ల మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో మరోసారి పవన్ కళ్యాణ్ గురించి, ఆయనతో సినిమా చేయబోతున్నట్లుగా వస్తున్న వార్తల గురించి రియాక్ట్ అయ్యారు డైరెక్టర్ హరీష్ శంకర్.
Samayam Telugu Harish Shankar Pawan Kalyan
హరీష్ శంకర్ పవన్


గతంలో పవన్ కళ్యాణ్‌కి 'గబ్బర్ సింగ్' రూపంలో సూపర్ డూపర్ హిట్ ఇచ్చారు హరీష్ శంకర్. దీంతో పవన్ రీ ఎంట్రీ మొదట్లోనే హరీష్- పవన్ సక్సెస్‌ఫుల్ కాంబో రిపీట్ కాబోతోందని వార్తలు షికారు చేశాయి. ఇదే విషయమై తాజా ఇంటర్వ్యూలో స్పందించిన హరీష్.. తానెప్పుడూ ఓ డైరెక్టర్‌ స్టేజ్‌లో పవన్ కళ్యాణ్‌ని చూడనని, ఓ ఫ్యాన్‌గా మాత్రమే చూస్తానని చెప్పారు. తాను చేసే ప్రాజెక్ట్ పవర్ స్టార్ అభిమానులు కోరుకునే విధంగా ఉంటుందని, అది చూసి పవన్ అభిమానులు ఆయనను మరింతగా ఆరాధిస్తారని చెప్పారు హరీష్.



ప్రస్తుతం తాను ఓ వెబ్ సిరీస్ కోసం పనిచేస్తున్నానని ఈ సందర్బంగా ఆయన వెల్లడించారు. నిర్మాతలు మహేష్ ఎస్ కొనేరు, బన్నీ వాస్‌ల సహకారంతో త్వరలో సినిమాలు నిర్మించడం ప్రారంభిస్తానని అన్నారు. అలాగే మహేష్ బాబుతో సినిమా చేసేందుకు ఓ స్క్రిప్ట్ డెవలప్ చేస్తున్నానని చెప్పారు. దీనిబట్టి చూస్తే తన తదుపరి మూవీ పవన్‌తో కాదు మహేష్ బాబుతో ఉంటుందని హింట్ ఇచ్చారు హరీష్ శంకర్.

Also Read: కరోనాపై 'గబ్బర్ సింగ్' కమెడియన్స్ ర్యాప్ సాంగ్.. పవన్ కళ్యాణ్ రియాక్షన్ చూస్తే!!

ఇకపోతే ఈ కరోనా కల్లోల సమయంలో పేదవారికి సహాయం చేసే అదృష్టం తనకు దక్కడం ఆనందంగా ఉందని హరీష్ చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, NRI స్నేహితుల సహకారంతో పేద కుటుంబాలకు అండగా నిలుస్తున్నామని చెప్పారు. అయితే ఇలా చేయడం తనను తాను ప్రమోట్ చేసుకోవడానికి మాత్రం కాదని ఆయన అన్నారు. తనను చూసి ఇంకొంతమంది ముందుకొచ్చి ఇలా పేదవారికి సహాయపడాలనే ఆలోచన మాత్రమే అని చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.