యాప్నగరం

Happy Birthday Nagarjuna: అందానికి బ్రాండ్‌ అంబాసిడర్‌.. నవ మన్మథుడిగా వెలిగిపోతున్న బిగ్ బాస్

Akkineni Nagarjuna Birthday: ఆరు పదుల వయసులోనూ అమ్మాయిల మనసులను కొల్లగొడుతూ నవ మన్మథుడిగా నేటికీ అదే గ్లామర్ మెయిన్‌టైన్ చేస్తున్నారు నాగార్జున. ఈ టాలీవుడ్ కింగ్ బర్త్ డే సందర్భంగా 'సమయం తెలుగు' తరఫున స్పెషల్ విషెస్ అందిస్తున్నాం.

Samayam Telugu 29 Aug 2021, 11:23 am
అక్కినేని నట వారసుడిగా, సీనియర్ హీరో నాగేశ్వరరావు తనయుడిగా తెలుగు తెరపై 'ఎదురులేని మనిషి'గా 'సూపర్' స్పీడులో దూసుకుపోతున్నారు నాగార్జున. అమ్మాయిల మనసులను కొల్లగొడుతూ నవ మన్మథుడిగా నేటికీ అదే గ్లామర్ మెయిన్‌టైన్ చేస్తూ షాకిస్తున్న ఆయన.. బిగ్ బాస్‌గా ప్రతి ఇంట సందడి చేస్తున్నారు. ఆరు పదుల వయసులోనూ తనదైన ఎనర్జీతో మ్యాజిక్ చేస్తూ వైవిద్యభరితమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు.
Samayam Telugu HBD Nagarjuna: అందానికి బ్రాండ్‌ అంబాసిడర్‌..
Nagarjuna


మాస్ హీరోగా, క్లాస్ ఆడియన్స్‌ని మెప్పించగల సత్తా నాగార్జున సొంతం. అన్నమయ్య, షిరిడి సాయిగా మైమరిపిస్తూ అలాంటి రోల్స్ చేయడం నాగార్జునకు మాత్రమే సాధ్యం అనేలా చేశారు. ఇతర హీరోలతో పోల్చితే రొమాంటిక్ డోస్ దట్టిస్తూ వెండితెరపై రొమాన్స్ చేయడంలోనూ నాగార్జునదే పైచేయి. క్లాస్, మాస్, భక్తి, రక్తి ఇలా అన్ని కోణాల్లో హవా నడిపిస్తున్న ఈ కింగ్ పుట్టిన రోజు ఈ రోజు (ఆగస్టు 29). ఈ సందర్భంగా ఆయనకు పలువురు సినీ ప్రముఖులు బర్త్ డే విషెస్ పోస్ట్ చేస్తున్నారు.
God Father: చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న గద్దర్! వైరల్ అవుతున్న క్రేజీ అప్‌డేట్
అక్కినేని నటవారసుడిగా సినీ రంగంలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేస్తున్న నాగార్జున.. బుల్లితెరపై కూడా సక్సెస్ అయ్యారు. బిగ్ బాస్ హోస్ట్‌గా బుల్లితెర ఆడియన్స్‌ని ఫిదా చేస్తూ ఆ షోకి భారీ టీఆర్ఫీ తెచ్చిపెడుతున్నారు. మరికొద్ది రోజుల్లో నాగార్జున హోస్ట్‌గా బిగ్ బాస్ తెలుగు సీజన్-5 ప్రారంభం కానుంది. మరోవైపు రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'బంగార్రాజు' సినిమాతో బిజీగా ఉన్నారు నాగార్జున. అందానికి బ్రాండ్‌ అంబాసిడర్‌‌గా, ఎలాంటి క్యారెక్టర్ అయినా తనకు కొట్టిన పిండి అన్నట్లుగా తెలుగు తెరపై వెలుగు వెలుగుతున్న నాగార్జునకు 'సమయం తెలుగు' తరఫున ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.