యాప్నగరం

స్టార్ హీరోతో హెబ్బా పటేల్ రొమాన్స్!

తెలుగులో ‘కుమారి 21ఎఫ్’ సినిమా ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న బ్యూటీ హెబ్బా పటేల్.

TNN 26 Aug 2017, 3:59 pm
తెలుగులో ‘కుమారి 21ఎఫ్’ సినిమా ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న బ్యూటీ హెబ్బా పటేల్. ఎంత మంచి గుర్తింపు వచ్చినా ఇప్పటి వరకు పెద్ద హీరోల సరసన నటించే అవకాశం రాలేదు. కానీ ఇప్పుడు ఈ పాప బంపరాఫర్ కొట్టేసినట్లు తెలుస్తోంది. తమిళ స్టార్ హీరో, ఇళయదలపతి విజయ్ సరసన నటించే అవకాశం కొట్టేసి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది హెబ్బా. అయితే ఇప్పటివరకు రాజ్‌తరుణ్, నిఖిల్ వంటి చిన్న హీరోల సరసన మాత్రం నటించిన ఈ బ్యూటీకి విజయ్ సరసన అవకాశం రావడం అదృష్టమనే చెప్పాలి.
Samayam Telugu hebah patel to romance with ilayathalapathy vijay
స్టార్ హీరోతో హెబ్బా పటేల్ రొమాన్స్!


ప్రస్తుతం విజయ్.. అట్లీ దర్శకత్వంలో ‘మెర్సల్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో విజయ్ మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడు. ఆయన సరసన నిత్యామీనన్, కాజల్ అగర్వాల్, సమంతలు జంటగా కనిపించనున్నారు. ఈ సినిమాను తెలుగులో ‘అదిరింది’ అనే పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమా తరువాత మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ పని చేయనున్నారని సమాచారం.

గతంలో విజయ్-మురుగదాస్ కాంబినేషన్‌లో ‘కత్తి’, ‘తుపాకి’ వంటి సూపర్ హిట్ సినిమాలు రూపొందాయి. మరోసారి వీరిద్దరు కలిసి పని చేస్తున్నారనే వార్తలు బయటకు రాగానే విజయ్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. సినిమా మొదలుకాకుండానే దీనిపై అంచనాలు పెరిగిపోతున్నాయి. కథ ప్రకారం ఈ సినిమాలో ఇద్దరు లేదా ముగ్గురు హీరోయిన్ల అవసరం ఉంటుందట. అందులో ఒకరిగా హెబ్బా పటేల్‌ను ఎంపిక చేసుకున్నారని ఆమె సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంపై అధికార ప్రకటన వెలువడనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.