యాప్నగరం

పోరాడండి... కానీ చలపతి బాబాయ్ ని వదిలేయండి!

నటుడు చలపతిరావు వివాదాస్పద వ్యాఖ్యలపై నటి హేమ స్పందించారు.

TNN 24 May 2017, 1:56 pm
నటుడు చలపతిరావు వివాదాస్పద వ్యాఖ్యలపై నటి హేమ స్పందించారు. చలపతిరావు స్త్రీలను కించపరుస్తున్నట్టుగా చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టిన హేమ, ఇదే సమయంలో ఆయన సంస్కారవంతుడని వ్యాఖ్యానించారామె. చలపతిరావు క్షమాపణలు కూడా చెప్పారని, కాబట్టి ఆయనపై పెట్టిన కేసులను వెనక్కు తీసుకోవాలని హేమ కోరారు.
Samayam Telugu hema on chalapati rao comments
పోరాడండి... కానీ చలపతి బాబాయ్ ని వదిలేయండి!


చలపతిరావు తమకు సుపరిచితుడు అని, ఆయన సరదాగా మాట్లాడతారు కానీ, ఆడవాళ్లకు ఎలాంటి హానీ చేయరని హేమ అన్నారు. అలాంటాయన ‘రారండోయ్ వేడుక చూద్దాం..’ సినిమా ఆడియో వేడుకలో చిన్న తప్పు చేశారని, అనుచితంగా మాట్లాడారని.. అది తప్పే అని ఆమె అభిప్రాయపడ్డారు. అయితే వ్యక్తిగతంగా ఆయన తనకు తెలుసు అని, చలపతి రావును బాబాయ్ గా సంబోధించిన హేమ ఆయన సంస్కారవంతుడని అన్నారు.

మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసే వారిపై పోరాడటం మంచిదే అని, ఈ విషయంలో సోషల్ మీడియాను తను అభినందిస్తున్నాను అని చెప్పిన హేమ.. ఇలాంటి పోరాటాలు కొనసాగాలని అన్నారు. కానీ చలపతిరావు క్షమాపణలు చెప్పారు కాబట్టి.. ఆయనను క్షమించేయాలని అభిప్రాయపడ్డారు. కేసులను వెనక్కు తీసుకోవాలని కోరారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.