యాప్నగరం

శంకర్‌ను ఇబ్బంది పెడుతున్న వడివేలు!

దక్షిణాదిలో దర్శకుడు శంకర్ పేరు తెలియని వారుండరు. ‘రోబో’ సినిమాతో ఆయన స్థాయి దేశవ్యాప్తం అయింది.

TNN 19 Nov 2017, 2:12 pm
దక్షిణాదిలో దర్శకుడు శంకర్ పేరు తెలియని వారుండరు. ‘రోబో’ సినిమాతో ఆయన స్థాయి దేశవ్యాప్తం అయింది. అద్భుతమైన సినిమాలను రూపొందిస్తూ ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు శంకర్. ప్రస్తుతం ఆయన ‘2.0’ సినిమా పూర్తిచేసే పనిలో పడ్డారు. ఇదిలా ఉంటే దర్శకుడిగానే కాకుండా నిర్మాతగా కూడా పలు చిత్రాలను నిర్మించారు శంకర్. గతంలో ఆయన సొంత ప్రొడక్షన్‌లో తన శిష్యుడు చింబుదేవన్ దర్శకుడిగా ‘ఇంసాయి అరసన్ 24యమ్ పులకేశి’ అనే సినిమాను నిర్మించాడు. ఈ సినిమాలో కమెడియన్ వడివేలు ప్రధాన పాత్ర పోషించారు.
Samayam Telugu heres why shankar has filed a complaint against vadivelu
శంకర్‌ను ఇబ్బంది పెడుతున్న వడివేలు!


ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌ను శంకర్ రూపొందిస్తున్నారు. వడివేలు, చింబుదేవన్ కాంబినేషన్‌లోనే ఈ సినిమా తెరకెక్కుతోంది. అయితే వడివేలు మాత్రం తన ప్రవర్తన కారణంగా చిత్రబృందాన్ని, శంకర్‌ను బాగా ఇబ్బంది పెడుతున్నారట. షూటింగ్‌కు సరైన సమయానికి రాకపోవడం, రెమ్యూనరేషన్ విషయంలో ఇబ్బంది పెట్టడం వంటివి చేస్తున్నారట. గతంలో కూడా ఆయనపై ఇలాంటి ఫిర్యాదులు ఉన్నాయి. ఇక వడివేలుతో విసిగిపోయిన శంకర్ నడిగర్ సంఘంలో ఆయనపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. మరి ఈ విషయంలో నడిగర్ సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో.. చూడాలి!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.