యాప్నగరం

ఆహాలో అడివి శేష్ 'మేజర్' టీమ్ సందడి.. ఉర్రూతలూగించిన స్టెప్స్

ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాం 'ఆహా' మేజర్ మూవీ టీమ్ సందడి చేసింది. హీరో అడివి శేష్ మేజర్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆహాలో ప్రసారమయ్యే తెలుగు ఇండియన్ ఐడల్, సర్కార్ 2 షోలలో పాల్గొన్నారు.

Authored byAshok Krindinti | Samayam Telugu 26 May 2022, 3:29 pm
మేజర్ మూవీ టీమ్ ప్రమోషన్స్‌లు ఫుల్ బిజీబిజీగా ఉంటోంది. ఓవైపు ఇంటర్వ్యూలు ఇస్తూనే.. మరోవైపు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తాజాగా తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాంలో ఆహాలో సందడి చేశారు. ఆహాలో ప్రసారం అవుతున్న తెలుగు ఇండియన్ ఐడల్, సర్కార్ 2 షోలలో పాల్గొని.. ఆడియన్స్‌ను అలరించారు. అడివి శేష్‌తో పాటు శోభిత ధూళిపాళ కూడా ఆహాలో సందడి చేశారు.
Samayam Telugu ఆహాలో మేజర్ టీమ్ సందడి


యాంకర్ ప్రదీప్ మాచిరాజు హోస్ట్ చేస్తున్న షో సర్కార్ 2. వారంవారం అందరినీ అలరిస్తూ మైమరిపిస్తున్న ప్రదీప్.. ఈ సారి మేజర్ మూవీ టీమ్‌తో చేస్తున్న గమ్మతులు ఆడియన్స్ అలరిస్తాయి. సర్కారు 2 షో ఈ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ఆహాలో ప్రసారం అవుతుంది. అడివి శేష్ ఆడియన్స్‌ను అలరిస్తూ వేసే స్టెప్స్ అందరిని ఉర్రూతలూగిస్తాయి.

అదేవిధంగా మన తెలుగు ఇండియన్ ఐడల్‌లో ఈ వారం అడివి శేష్, శోభిత చేసే అల్లరి అంతాఇంతా కాదు. వాగ్దేవి పాటకు అడివి శేష్ మైమరిచిపోయాడు. ఆయనే వైష్ణవితో డ్యాన్స్ చేయాలని కోరడం మరో విశేషం. అలా ఆట పాటలతో సాగిపోయే ఈ సుస్వరాల వేదిక ఈ శుక్ర, శనివారలలో ఆహాలో రాత్రి 9 గంటలకు ప్రసారం కాబోతుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.