యాప్నగరం

సీక్రెట్ ఫోన్ నంబరే ఆ హీరోను పట్టించింది!

తనను కిడ్నాప్ చేయడం, లైంగికంగా వేధించడం వెనక ఓ ప్రముఖ హీరో హస్తం ఉందని మలయాళ నటి మొదటి నుంచి ఆరోపిస్తున్న..

TNN 12 Jul 2017, 2:15 pm
తనను కిడ్నాప్ చేయడం, లైంగికంగా వేధించడం వెనక ఓ ప్రముఖ హీరో హస్తం ఉందని మలయాళ నటి మొదటి నుంచి ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల లభించిన ఓ కీలక సాక్ష్యం ఆధారంగా మలయాళ సూపర్‌ స్టార్ దిలీప్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దిలీప్ వాడిన ఓ సీక్రెట్ మొబైల్ నంబర్ వల్లే ఆయన అడ్డంగా బుక్కైపోయారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన పల్సర్ సునీ తన ఫోన్ నుంచి ఇండస్ట్రీకి చెందిన కొంత మందికి తరచూ సమాచారం అందించాడు. అతడు ఎవరితో మాట్లాడాడో మాత్రం పోలీసులకు చెప్పలేదు.
Samayam Telugu hero dilips secret phone number led to his arrest
సీక్రెట్ ఫోన్ నంబరే ఆ హీరోను పట్టించింది!


మరోవైపు డబ్బు ఇవ్వాలంటూ పల్సర్ సునీ తనను వేధిస్తున్నాడంటూ.. దిలీప్ కొన్ని రోజుల కిందట పోలీసులను ఆశ్రయించాడు. రూ. 1.5 కోట్లు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేశాడని ఆయన పోలీసుల వద్ద వాపోయాడు. దిలీప్ ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు గత వారం అతణ్ని పిలిపించి సుమారు 12 గంటలపాటు ప్రశ్నించారు.

దిలీప్ భార్య కావ్య మాధవన్, అతడి మేనేజర్, అనూప్ అనే మరో వ్యక్తికి దిలీప్ చేసిన కాల్ లిస్ట్‌ను పరిశీలించగా కొత్త విషయం తెలిసింది. దిలీప్ ఓ ప్రైవేట్ నంబర్‌ ద్వారా తన సన్నిహితులకు కాల్స్ చేసేవాడని, నటి కేసుతో సంబంధం ఉన్న వ్యక్తులకు కూడా అదే నంబర్‌ నుంచి తరచూ కాల్స్ వెళ్లాయని పోలీసులు గుర్తించారు. దీంతో అతణ్ని అరెస్టు చేశారు.

మరోవైపు బెయిల్ కోసం దిలీప్‌ చేసుకున్న పిటిషన్‌ను అంగమలి జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు తిరస్కరించింది. అతణ్ని రెండు రోజులపాటు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలిచ్చింది. వ్యక్తిగత కక్షతోనే నటిపై ఇంతటి అఘాయిత్యానికి దిలీప్‌ ప్లాన్ చేశాడా అనే కోణంలో అతణ్ని మరింత లోతుగా ప్రశ్నించాలని పోలీసులు భావిస్తున్నారు.

ఈ కుట్రలో ఇంకెవరి ప్రమేయం ఉందనే కోణంలోనూ విచారణ సాగనుంది. దిలీప్.. సదరు నటిపై అఘాయిత్యానికి గతంలో 3 సార్లు పథక రచన చేసి విఫలమయ్యాడన్న నేపథ్యంలో.. కొచ్చి, త్రిశూర్‌లోని పలు ప్రాంతాలకు అతణ్ని తీసుకెళ్లి విచారించనున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.