యాప్నగరం

​ రాంచరణ్ ప్లేస్‌లోకి నాని!

గత కొన్నిరోజులుగా దర్శకుడు గౌతమ్ మీనన్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపించాయి. గౌతమ్ మీనన్ కథల శైలి విభిన్నంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ కాంబినేషన్ హిట్ కొట్టడం ఖాయమని అభిమానులు భావించారు.

TNN 1 Nov 2016, 5:38 pm
గత కొన్నిరోజులుగా దర్శకుడు గౌతమ్ మీనన్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపించాయి. గౌతమ్ మీనన్ కథల శైలి విభిన్నంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ కాంబినేషన్ హిట్ కొట్టడం ఖాయమని అభిమానులు భావించారు. అయితే చరణ్ వరుస ప్రాజెక్ట్స్ కమిట్ అవ్వడం వలన గౌతమ్‌తో సినిమా ఎప్పుడు చేస్తాడనే అనుమానాలు కూడా కలిగాయి. కానీ ఇప్పుడు అసలు చరణ్‌తో గౌతమ్ సినిమా లేదని క్లియర్ కట్ గా తెలుస్తోంది.
Samayam Telugu hero nani replaced ram charan with gautham menon movie
​ రాంచరణ్ ప్లేస్‌లోకి నాని!


తెలుగు, తమిళ భాషల్లో గౌతమ్ మీనన్‌కు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. ఆయనతో సినిమా చేయాలని చాలా మంది హీరోలు ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ చరణ్ మాత్రం గౌతమ్‌తో సినిమా చేయడానికి డేట్స్ కేటాయించలేకపోయాడనే టాక్ వినిపిస్తుంది. గౌతమ్ మీనన్ చరణ్‌తో చేయాలనుకున్న సినిమా తెలుగు, తమిళం రెండు భాషల్లో రూపొందించాలనుకున్నాడు. ఈ విధంగా చేయడం వలన ఖచ్చితంగా సినిమా చేయడానికి చాలా సమయం పడుతుంది. అందుకే చరణ్ ఈ ప్రాజెక్ట్ పై పెద్దగా ఆసక్తి చూపలేదు. డేట్స్ లేవనే కారణం చెప్పి తప్పించుకున్నాడని ఫిల్మ్ నగర్ టాక్.

దీంతో గౌతమ్ మీనన్ కాంపర్మైజ్ కాకతప్పలేదు. చరణ్‌కు బదులుగా హీరో నానితో సినిమా చేయాలనే నిర్ణయం తీసుకున్నాడట. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో 'ఎటో వెళ్లిపోయింది మనసు' సినిమా రూపొందింది. ఆ సినిమాకు ఏవరేజ్ టాక్ వచ్చినప్పటికీ యువతను మాత్రం సినిమా విపరీతంగా ఆకర్షించింది. మొత్తానికి రాంచరణ్ ప్లేస్‌ని రిప్లేస్ చేసిన నాని ఈసారి ఎలాంటి హిట్ కొడతాడో చూడాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.