Nikhil Siddhartha: యువ కథానాయకుడు నిఖిల్ ఇప్పుడు పాన్ ఇండియా ఇమేజ్ను సంపాదించుకున్నారు. ఆయన గత చిత్రం కార్తికేయ 2 పాన్ ఇండియా రేంజ్లో ఎలాంటి సక్సెస్‌ను సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు నిఖిల్‌కి అసలు టెన్షన్ పట్టుకుంది. ఆయన నెక్ట్స్ చేస్తున్న పాన్ ఇండియా మూవీ స్పై. తెలుగు, హిందీ, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో సినిమాను రిలీజ్ చేయటానికి రెడీ అవుతున్నారు. ఎడిటర్ గ్యారీ బి.హెచ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. స్పై మూవీకి సంబంధించి రిలీజ్ డేట్ విషయంలో నిఖిల్లో తెలియని ఆందోళన నెలకొంది. ఎందుకంటే ఒకప్పుడంటే తన సినిమాను తెలుగులో మంచి రిలీజ్ డేట్ చూసుకుని రిలీజ్ చేసుకుంటే చాలు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. దీంతో నిఖిల్ ఆ డేట్‌ను చెప్పాలంటూ ప్రేక్షకులనే అడిగేశాడు. తాను కూడా ఊరకనే అడగలేదు. తన దగ్గర సీసీఎల్ క్రికెట్ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్స్ ఉన్నాయని, మంచి రిలీజ్ డేట్ చెప్పిన వారికి ఆ టికెట్స్‌ను ఇస్తానంటూ ఆశ చూపాడు. దీంతో నెటిజన్స్ స్పై సినిమా రిలీజ్ డేట్స్‌ను మెసేజెస్ రూపంలో తెలియజేస్తున్నారు. మరి ఈ డేట్స్‌లో నిఖిల్ ఏ డేట్‌ను సెలక్ట్ చేసుకుంటారో చూడాలి మరి.
గూఢచారి, ఎవరు, హిట్ వంటి విజయవంతమైన చిత్రాలకు ఎడిటర్‌గా వర్క్ చేసిన గ్యారీ బి.హెచ్ ఈ స్పై సినిమాతో డైరెక్టర్‌గా మారారు. ఇందులో నిఖిల్‌ను యాక్షన్ హీరోగా ఎలివేట్ చేస్తున్నారు. ఈ సినిమా కూడా హిట్ అయితే హీరోగా నిఖిల్ నెక్ట్స్ రేంజ్‌కు చేరుకున్నట్లేనని అనుకోవాలి. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తోన్న ఈ సినిమాకు జులైన ఎస్ట్రాడా సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
LSO READ:త్వరలోనే గుడ్ న్యూస్ చెబుతా: కియారా అద్వానీ
ALSO READ: RRRకి స్టాండింగ్ ఒవేషన్.. రామ్ చరణ్ రియాక్షన్
ALSO READ: Pathaan 2: ‘బాహుబలి 2’ని బీట్ చేసిన ‘పఠాన్’.. డైరెక్టర్ రియాక్షన్

- Read latest Tollywood updates and Telugu News