యాప్నగరం

Sharwanand: ప్రగతి భవన్‌లో శర్వానంద్.. పెళ్లి కార్డులతో ప్రత్యక్షమైన హీరో

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ ఇటీవలే కారు యాక్సిడెంట్‌కు గురయ్యాడు. అయితే, ప్రమాద తీవ్రత లేకపోవడంతో సేఫ్‌గా బయటపడ్డాడు. ఇదిలా ఉంటే, తాజాగా శర్వానంద్.. తన పెళ్లి కార్డులతో ప్రగతి భవన్‌లో ప్రత్యక్షమయ్యాడు. మరి అక్కడ ఎవరెవరిని ఆహ్వానించాడంటే..

Authored byసంతోష్ దామెర | Samayam Telugu 30 May 2023, 6:41 pm

ప్రధానాంశాలు:

  • ప్రగతి భవన్‌లో ప్రత్యక్షమైన శర్వానంద్
  • బీఆర్‌ఎస్ ఎంపీ సంతోష్ కుమార్‌తో ఫొటో
  • తన పెళ్లికి రావాల్సిందిగా ఆహ్వానించిన హీరో
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Sharwanand, MP Santhosh
Sharwanand: శర్వానంద్
గతేడాది ‘ఒకే ఒక జీవితం’ ( Oke Oka Jeevitham) మూవీతో హిట్ కొట్టిన శర్వానంద్ (Shrwanand).. ప్రస్తుతం దర్శకుడు శ్రీరామ్ ఆదిత్యతో ఓ సినిమా చేస్తున్నాడు. ఇదిలా ఉంటే, ఆదివారం ఉదయం శర్వా ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్‌కు గురైన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లో తెల్లవారు జామున 3 గంటలకు ఫిల్మ్ నగర్ జంక్షన్ వద్ద అదుపు తప్పి బోల్తాపడింది. ఈ న్యూస్ శర్వానంద్ ఫ్యాన్స్‌ను కలవరపెట్టగా.. ఎవరికి ఏం కాకపోవడంతో అంతా ఊపరి పీల్చుకున్నారు. ఇదిలా ఉంటే, ఈ రోజు (మంగళవారం) తను.. సీఎం నివాసముండే ప్రగతి భవన్‌లో (Pragathi Bhavan) ప్రత్యక్షమయ్యాడు. ఈ మేరకు రాజ్యసభ ఎంపీ సంతోష్ రావును (MP Santhosh) కలుసుకున్న ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది.
విషయానికొస్తే.. శర్వానంద్ పెళ్లి (Sharwanand Marriage) రక్షితా రెడ్డితో (Rakshita Reddy) జూన్ 3న జరగనుంది. ఈ సందర్భంగానే పెళ్లి కార్డులతో ప్రగతి భవన్‌కు వెళ్లిన శర్వానంద్.. అక్కడ ఎంపీ సంతోష్‌ను కలిసి పెళ్లికి ఆహ్వానించాడు. ఇందుకు సంబంధించిన ఫొటో నెట్టింట షేర్ చేశారు. అయితే, ఈ ఫొటో బయటికి రావడంతో సీఎం కేసీఆర్‌ను (CM KCR) సైతం పెళ్లికి ఆహ్వానించి ఉండవచ్చని తెలుస్తోంది. ఇక తను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి రక్షితా రెడ్డి తండ్రి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో న్యాయవాది. అంతేకాదు ఆమె తాత బొజ్జల గోపాల కృష్ణారెడ్డి ప్రముఖ పొలిటిషియన్ అని తెలిసిందే. అయితే, ఈ రేంజ్ పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉండటంతో సీఎం కేసీఆర్ పెళ్లికి హాజరు కావచ్చని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

ఇదిలా ఉంటే, వరుస ఫ్లాప్స్‌తో సతమతమవుతున్న శర్వానంద్‌కు గతేడాది చివరన ‘ఒకే ఒక జీవితం’ మూవీతో హిట్ దక్కింది. తెలుగు, తమిళ్‌లో బైలింగువల్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి శ్రీ కార్తీక్ దర్శకత్వం వహించాడు. అంతకుముందు ఐదేళ్ల పాటు అంటే 2017లో వచ్చిన ‘శతమానం భవతి’ చిత్రం తర్వాత ఫ్లాప్స్ కంటిన్యూ అయ్యాయి. ఇక హిట్ మూవీ తర్వాతనే పెళ్లికి సిద్ధమైన శర్వానంద్ కెరీర్.. ఇప్పటి నుంచి ఎలా ఉంటుందో చూడాల్సిందే.



రచయిత గురించి
సంతోష్ దామెర
సంతోష్ దామెర సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ప్రతిరోజూ సినిమా, ఎంటర్‌టైన్‌మెంట్ రంగాలకు సంబంధించిన కొత్త అప్‌డేట్‌లు, స్పెషల్ స్టోరీలు అందిస్తారు. తనకు జర్నలిజంలో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇప్పటివరకు ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, సినిమా, లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన సమాచారాన్ని అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.