మరాఠీ సినిమా ‘సైరత్’కు రీమేక్ గా హిందీలో రూపొందుతున్న ‘ధడక్’ బాగా వార్తల్లో నిలుస్తున్న సినిమా. పరువు హత్యల కాన్సెప్ట్ మీద రూపొందుతున్న సినిమాగా ఒక రకంగా ఆసక్తిని రేపుతుంటే, మరోవైపు ఈ సినిమాతో శ్రీదేవి తనయ జాన్వీకపూర్ బాలీవుడ్ కు పరిచయం అవుతోంది. ఈ సినిమా మేకింగ్ దశలో ఉండగానే శ్రీదేవి కూడా భౌతికంగా దూరం అయ్యింది. ఈ నేపథ్యంలో.. శ్రీదేవి అభిమానులు జాన్వీ తొలి సినిమా కోసం ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు.
తల్లి దూరమైన విషాదం నుంచి ఇప్పుడిప్పుడే కొంత కోలుకుంటున్న జాన్వీకపూర్ ప్రస్తుతం ‘ధడక్’ షూటింగ్ లో పాల్గొంటోంది. ఈ నేపథ్యంలో ఒక సరదా సన్నివేశం చోటు చేసుకుంది. షూటింగ్ బ్రేక్ లో జాన్వీ ఒళ్లో కూర్చుకున్నాడు ఇషాన్ ఖట్టర్.
దఢక్ లో హీరో ఇతడు. బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ కు తమ్ముడి వరస అవుతాడు. అంతేకాదు.. ఈ సినిమాకు ముందు నుంచినే జాన్వీ, ఇషాన్ లు మంచి స్నేహితులు. ఇద్దరూ ఒకే సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. సినిమాకు ముందు నుంచి ఉన్న సాన్నిహిత్యమే వీరిని బెస్ట్ ఫ్రెండ్స్ ను చేసేసింది. ఆ సాన్నిహిత్యం సరదాగా ఇలా ఆవిష్కృతమైంది!