యాప్నగరం

‘దానికి సూపర్‌స్టార్ కటౌట్‌యే సాక్ష్యం’.. బావకు తన సినిమా స్టైల్‌లో విషెస్ చెప్పిన సుధీర్ బాబు

సూపర్‌స్టార్ మహేష్‌బాబు పుట్టినరోజు సందర్భంగా సెలబ్రిటీలు, అభిమానులు ఆయనకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా మహేష్ బాబు సోదరి భర్త, హీరో సుధీర్ బాబు తనదైన స్టైల్‌లో ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

Samayam Telugu 9 Aug 2021, 2:29 pm
యంగ్ హీరో సుధీర్ బాబు హీరోగా రాబోతున్న కొత్త సినిమా 'శ్రీదేవి సోడా సెంటర్'. ఈ సినిమాలో సుధీర్ బాబు క్యారెక్టర్ చాలా డిఫరెంట్‌గా ఉండబోతోంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదల అయిన ఫస్ట్‌లుక్ పోస్టర్లు, టీజర్లు, ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రీసెంట్ హీరోయిన్ సోడాల శ్రీదేవిని పరిచయం చేస్తూ ఇంట్రో వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో హీరోయిన్ ఆనంది ఈ పాత్రలో నటిస్తోంది.
Samayam Telugu మహేష్‌బాబు, సుధీర్ బాబు
Mahesh Babu, Sudheer Babu


తాజాగా విడుదలైన ఆమె ఫస్ట్‌లుక్ పోస్టర్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అయితే తాజాగా సూరిబాబు ఓ స్టార్ హీరో కటౌట్‌కి లైటింగ్ పెట్టారు. ఆయన మరెవరో కాదు సూపర్‌స్టార్ మహేష్‌బాబు. వరుసకు మహేష్‌బాబు, సుధీర్ బాబు బావబామ్మర్దులు అవుతారు. మహేష్ సొదరిని సుధీర్ వివాహం చేసుకున్నారు. అయితే చాలాకాలం తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సోమవారం మహేష్ తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సుధీర్‌ తనదైన స్టైల్‌లో విషెస్ తెలిపారు.

శ్రీదేవి సోడా సెంటర్ సినిమాలో ఆయన లైట్స్ పెట్టేవాడిగా నటిస్తున్నారు. అయితే ‘సూరిబాబు లైటింగ్ ఎడితే నక్షత్రాలు ఊరికి దిగొచ్చినట్టే అని ఊరూరంతా అంటారు !! దానికి సూపర్ స్టార్ కటౌట్ సాక్ష్యం ’ అంటూ మహేష్ కటౌట్‌కి లైటింగ్ పెట్టిన వీడియోని ఆయన షేర్ చేశారు. తమ సినిమా తరపున ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తన సినిమా ప్రమోషన్ చేసుకుంటూనూ మహేష్‌కి విషెస్ తెలిపి ఫ్యాన్స్‌ని ఆకట్టుకున్నారు సుధీర్ బాబు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.
View this post on Instagram A post shared by Sudheer Babu (@isudheerbabu)

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.