యాప్నగరం

Suriya Jai Bhim: దొంగలకు కూడా జాతి ఉంటుందా.. ‘జై భీమ్’ టీజర్‌లో సూర్య విశ్వరూపం.. కుల వివక్షకి తూట్లు

తన విలక్షణ నటనతో వైవిధ్యమైన కథల్ని ఎంచుకుని సౌత్‌ ఇండియన్‌ సిల్వర్‌ స్క్రిన్‌పై తన మార్క్‌ చూపిస్తున్న హీరో సూర్య తాజా చిత్రం ‘జై భీమ్’.. దీపావళి కానుకగా నవంబర్‌ 2న అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానున్న ఈ మూవీ టీజర్ విడుదలైంది.

Samayam Telugu 15 Oct 2021, 8:41 pm
ఇలాంటి సినిమా తీయాలంటే దమ్ము, ధైర్యం కావాలి.. ఇలాంటి దమ్మున్న పాత్రలకి కేరాఫ్ అడ్రస్ అయిన సూర్య లేటెస్ట్ మూవీ ‘జై భీమ్’. దళితవాడల్లో వినిపించే ‘జై భీమ్’ నినాదం వెనుక అణచివేతకు గురయ్యే దళిత జాతి ఆక్రందనలు ఉన్నాయి. వాటికి కళ్లకి కట్టే ప్రయత్నమే ఈ ‘జై భీమ్’ సినిమా. దీపావళి కానుకగా నవంబర్‌ 2న అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానున్న ఈ మూవీ టీజర్‌ను శుక్రవారం నాడు విజయదశమి సందర్భంగా విడుదల చేశారు.
Samayam Telugu జై భీమ్ టీజర్
Jai Bheem Suriya


యథార్థ సంఘటనల ఆధారంగా ‘జై భీమ్‌’ చిత్రాన్ని రూపొందించారు దర్శకుడు టీజే జ్ఙానవేళ్‌. కథల ఎంపికలో వైవిధ్యత ప్రదర్శించే సూర్య ఈ చిత్రంలో దళిత వర్గాలకు అండగా నిలిచే లాయర్ పాత్రలో కనిపించారు. సమానత్వమే సమాజ మనుగడుకు ప్రాథమిక సూత్రం అది మరచి కుల వివక్షకు గురౌతున్న దళిత బతుకుల్ని 1.34 నిమిషాల నిడివితో ఉన్న ఈ టీజర్‌ కళ్లకి కట్టారు.

నువ్వు నీ వాళ్లు ఈ ఊరిలోనే బతకలేరు.. మీకు ఏమీ లేకుండా చేసేస్తాను అంటూ పోలీస్ అధికారి ఎస్టీ మహిళను చావబాదటం.. ‘ఒక ట్రైబల్ అమ్మాయిని హైకోర్టు వరకూ రానిచ్చారంటే ఎందుకయ్యా పోలీస్ ఉద్యోగం’ అని లాయర్ చెప్పే డైలాగ్ ఆలోచింపచేసే విధంగా ఉంది.

‘దొంగలకు కూడా ఓ జాతి ఉంటుందా నటరాజ్.. నీ జాతిలోనూ నా జాతిలోనూ పెద్ద పెద్ద దొంగలు ఉంటారు’ అని సూర్య చెప్పే డైలాగ్ విజిల్స్ వేయించేట్టుగా ఉన్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.