యాప్నగరం

విజయ్ దేవరకొండ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ వేలం.. రేటెంత పలికిందో తెలుసా

అర్జున్ రెడ్డి.. టాలీవుడ్‌తో పాటూ యూత్‌లోనూ ఫుల్ జోష్ నింపిన మూవీ. ఈ సినిమాలో అర్జున్ రెడ్డి క్యారెక్టర్‌లో అదరగొట్టిన విజయ్ దేవరకొండ.. ఏకంగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును దక్కించుకున్నాడు.

Samayam Telugu 16 Jul 2018, 3:12 pm
అర్జున్ రెడ్డి.. టాలీవుడ్‌తో పాటూ యూత్‌లోనూ ఫుల్ జోష్ నింపిన మూవీ. ఈ సినిమాలో అర్జున్ రెడ్డి క్యారెక్టర్‌లో అదరగొట్టిన విజయ్ దేవరకొండ.. ఏకంగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును దక్కించుకున్నాడు. ఆ అవార్డును వేలం వేసి వచ్చిన డబ్బును సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఇచ్చేస్తానని చెప్పి రియల్ హీరో అనిపించుకున్నాడు. చెప్పినట్లుగానే.. ఈ అవార్డును ఆదివారం వేలం వేశారు. ఇది ఏకంగా రూ.25లక్షల రేటు పలికింది
Samayam Telugu Vijay.


హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో దివీస్ ల్యాబరేటరీస్ అధినేత కిరణ్ సతీమణి శకుంతల.. విజయ్ దేవరకొండ చేతులు మీదుగా అందుకున్నారు. తర్వాత రూ.25లక్షల చెక్కును ఆమె అందజేశారు. శకుంతల ఈ అవార్డును విజయ్‌కు తిరిగి ఇవ్వబోగా తీసుకోలేదు. ఈ డబ్బును వెంటనే సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో రౌడీ వియర్స్ బ్రాండెడ్ జీన్స్‌ను కూడా లాంచ్ చేశారు.
The 1st @therowdyclub Sundowner Party. Filmfare given away. 25 lakhs raised for CMRF 😁 Divi labs you are now a part of my journey. This blacklady is special to all of us. I shall show my appreciation by visiting you all :) A post shared by Vijay Deverakonda (@thedeverakonda) on Jul 15, 2018 at 10:15am PDT

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.