యాప్నగరం

హీరోయిన్‌గా ఆఫర్ ఇస్తే మరి నాకేంటి అన్న హీరో!

లైంగిక వేధింపుల బారిపడిన వారిలో సామాన్య మహిళలే కాదు సెలబ్రెటీలు కూడా అనేక మంది చేరిపోతున్నారు.

TNN 7 Jan 2017, 8:08 pm
లైంగిక వేధింపుల బారిపడిన వారిలో సామాన్య మహిళలే కాదు సెలబ్రెటీలు కూడా అనేక మంది చేరిపోతున్నారు. ఇటీవల కాలంలో ఒకరిద్దరు హీరోయిన్‌లు పబ్లిక్‌గానే తాము వేధింపులను ఎదర్కొన్నామని ప్రకటించగా తాజాగా ఆ లిస్ట్‌లోకి చేరింది టాలీవుడ్ నటి అర్చన. ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దీన్ని బయటపెట్టింది. తన సినిమాలో ఆమెకి ఛాన్స్ ఇచ్చిన ఓ నటుడు షూటింగ్‌ పూర్తయిన తర్వాత నీకు నాతో నటించడానికి అవకాశం ఇచ్చాను మరి నాకేంటి అని అడిగాడని, ఆ సమయంలో నాకేం చెప్పాలో తెలియలేదంటూ కంటతడి పెట్టింది. వెంటనే మీకు ఇచ్చేంతదాన్ని కాదని చెప్పి అక్కణ్నుంచి వెళ్లిపోయానని తెలిపింది.
Samayam Telugu heroine archana veda revealed hero harassment
హీరోయిన్‌గా ఆఫర్ ఇస్తే మరి నాకేంటి అన్న హీరో!


ఆ తరువాత నాపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారని ఆ సినిమాలో తన రోల్‌ని చాలావరకు కట్‌ చేశారని మనసులోని వేదనను బయటపెట్టింది అర్చన. ఇలాంటి వేధింపులు చాలానే ఉన్నాయని , ఇండస్ట్రీలో ఇలాంటివి ప్రతి నటికి ఎక్కడో చోట ఎదురౌతూనే ఉంటాయంటూ వాపోయింది.

కొన్ని సందర్భాలలో హీరోలకు ఇగో అడ్డు వస్తుందని కనీసం పక్కని నిలబడటాన్ని కూడా వారు స్థాయి తగ్గినట్లు భావిస్తారని.. ఇక అవార్డుల ఫంక్షన్‌లో ఓ అవార్డు ఇవ్వడానికి ఓ నటుడితో కలిసి వేదిక మీదకు తాను వెళ్లాలని నిర్వాహకులు చెప్పారని, లాస్ట్ మినిట్‌లో ఆ హీరో తనతో కలిసి వేదిక మీదకు రావడానికి ఇష్టపడలేదని వెల్లడించింది. ఈ క్రమంలో హీరోకి తోడుగా మరో హీరోయిన్‌ను పంపించారని తెలిపింది అర్చన.

అయితే ప్రస్తుతం అర్చన చేసిన కామెంట్స్ టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ఆమెను లైంగిక వేధింపులకు గురిచేసిన ఆ హీరో ఎవరై ఉంటారా అని చర్చించుకోవడం మొదలుపెట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.