యాప్నగరం

Gautham Karthik : హీరోతో లివ్ ఇన్ రిలేష‌న్ షిప్‌పై నాగ చైత‌న్య‌ హీరోయిన్ కామెంట్స్‌ .. టెన్ష‌న్ ప‌డ్డానంటూ..

హీరో గౌత‌మ్ కార్తీక్‌తో ప్రేమ‌లో ఉన్నానంటూ వ‌స్తున్న వార్త‌ల‌పై ‘సాహ‌స‌మే శ్వాస‌గా సాగిపో’ ఫేమ్ మంజిమ మోహ‌న్ రీసెంట్ ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చారు. ప్రేమ, పెళ్లి విషయాలపై సీక్రెట్స్ దాచనని ఆమె ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.

Samayam Telugu 20 Mar 2022, 8:23 am

ప్రధానాంశాలు:

  • లవ్ ఎఫైర్‌పై మంజి మోహన్ వివరణ
  • ప్రేమ, పెళ్లి విషయాలపై సీక్రెట్స్ ఉండవని మంజిమ వివరణ
  • టెన్షన్ పడ్డ మలయాళ ముద్దుగుమ్మ
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu మంజిమ - గౌతమ్
Manjima Mohan - Gautham Karthik
చాలా మంచి పేరున్న సీనియ‌ర్ క‌థానాయ‌కుడి కుమారుడు త‌ను. ఆయ‌న కూడా ఇప్పుడు హీరోగా రాణిస్తున్నారు. అయితే రీసెంట్‌గా ఆయ‌న పెళ్లి గురించి ఆస‌క్తిక‌ర‌మైన వార్తొక‌టి సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేసింది. అదేంటంటే.. ఓ హీరోయిన్‌తో స‌ద‌రు కుర్ర హీరో ప్రేమ‌లో ఉన్నాడ‌ని, ఇద్ద‌రూ క‌లిసి లివ్ ఇన్ రిలేష‌న్ చేస్తున్నార‌ని, త్వ‌ర‌లోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ వార్త‌లు నెట్టింట షికార్లు చేశాయి. ఇంత‌కీ ఆ కుర్ర హీరో హీరోయిన్.. ఎవ‌రో తెలుసా! తెలుగులో సీతాకోక చిలుక వంటి సినిమా చేసిన హీరో కార్తీక్ అంద‌రికీ తెలుసు. ఈ కోలీవుడ్ హీరో కుమారుడు గౌత‌మ్ కార్తీక్‌. హీరోయిన్ మంజిమ మోహ‌న్‌. కుర్ర హీరో గౌత‌మ్ కార్తీక్‌.. మ‌ణిర‌త్నం సినిమా క‌డ‌లి సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు కూడా ప‌రిచ‌యం అయ్యారు.
ఈ హీరో ఇప్పుడు త‌మిళంలోనే సినిమాలు చేస్తూ వ‌స్తున్నారు. కొన్ని రోజుల నుంచి మ‌లయాళ ముద్దుగు మంజిమ మోహ‌న్‌తో గౌత‌మ్ ప్రేమ‌లో ఉన్నార‌ని, ఇద్ద‌రూ లివ్ ఇన్ రిలేష‌న్ చేస్తున్నార‌ని.. త్వ‌ర‌లో పెళ్లి కూడా జ‌ర‌గ‌నుందంటూ టాక్ అయితే గ‌ట్టిగానే వినించింది. దీనిపై రీసెంట్‌గా మంజిమ మోహ‌న్ స్పందించింది. తాను గౌత‌మ్ కార్తీక్ ప్రేమ‌ను అంగీక‌రించ‌లేద‌ని చెప్పింది. ప్రేమ‌, పెళ్లి అనేవి జీవితంలో చాలా ముఖ్య‌మైన విష‌యాలు కాబ‌ట్టి వాటిని దాచే అవ‌స‌రం త‌న‌కు లేద‌ని ఆమె చెప్పేసింది.

అయితే గౌత‌మ్‌తో ప్రేమ‌లో ఉన్నానంటూ వినిపించిన వార్తలు రావ‌డంతో మంజిమ మోహ‌న్ షాక్ అయ్యింద‌ట‌. త‌న త‌ల్లిదండ్రులు ఏమ‌ని అనుకుంటారోన‌ని టెన్ష‌న్ ప‌డింది. అయితే వారు ఈజీగా తీసుకోవ‌డంతో టెన్ష‌న్ రిలీష్ అయ్యింద‌ని ఆమె చెప్పింది. మంజిమ మోహ‌న్.. నాగ చైత‌న్య‌, గౌత‌మ్ వాసుదేవ్ మీన‌న్ కాంబినేష‌న్‌లో రూపొందిన సాహ‌స‌మే శ్వాస‌గా సాగిపో చిత్రంలో హీరోయిన్‌గా న‌టించిన సంగ‌తి తెలిసిందే. స్వ‌ర్గీయ ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో ఎన్టీఆర్ కుమార్తెల్లో ఒక‌రిగా ఆమె న‌టించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.