యాప్నగరం

విజయ్‌తో కలిసి సెల్ఫీ దిగిన రాశీ.. ఆ వెబ్‌సిరీస్ కోసమేనంటా..

ఈ మధ్యకాలంలో హీరోయిన్లు సినిమాలతో పాటు వెబ్‌సిరీస్‌లపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. స్టార్ హీరోయిన్లు కాజల్, సమంత, తమన్నాలు ఇప్పుటికే పలు వెబ్‌సిరీస్‌లలో నటించి ప్రేక్షకులను అలరించారు. తాజాగా విజయ్ సేతుపతితో ఓ వెబ్‌సిరీస్ షూటింగ్ సమయంలో దిగిన సెల్ఫీని ఆమె షేర్ చేసింది.

Samayam Telugu 2 Aug 2021, 5:30 pm
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అందరికి. ఆయన ప్రధాన పాత్రలో నటించిన సినిమాలు కొన్నే అయినా.. తన నటనతో కోట్లాది మంది ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కేవలం తమిళంలోనే కాదు.. తెలుగుతోపాటు ఇతర భాషల్లో కూడా ఆయన అభిమానులను సంపాదించుకున్నారు. తాజాగా ‘మాస్టర్’ అనే సినిమాలో విలన్‌గా నటించి.. ఆయన ఓ రేంజ్‌లో ప్రేక్షకులను అలరించారు.
Samayam Telugu రాశీ ఖన్నా, విజయ్ సేతుపతి
Raashi Khanna And Vijay Sethupathi


అయితే ఇప్పుడు విజయ్ సేతుపతి ఓ వెబ్‌సిరీస్‌లో నటిస్తున్నారని తెలుస్తోంది. ఈ మధ్యే ‘ది ఫ్యామిలీమ్యాన్’ అనే వెబ్‌సిరీస్‌తో మంచి సక్సెస్ అందుకున్న రాజ్ & డీకేలు ఈ వెబ్‌సిరీస్‌ని రూపొందిస్తున్నారు టాక్. బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ ప్రధాన పాత్రలో ఈ వెబ్‌సిరీస్ తెరకెక్కుతుంది. ఈ వెబ్‌సిరీస్‌లో హీరోయిన్ రాశీ ఖన్నా ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ షూటింగ్ సగం వరకూ పూర్తికావొచ్చింది.

ఇక ఈ వెబ్‌సిరీస్‌లో విజయ్ సేతుపతి ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ వెబ్‌సిరీస్‌కు ‘సన్నీ’ అనే టైటిల్‌ని ప్లాన్ చేస్తున్నారని సమాచారం. తాజాగా ఈ వెబ్‌సిరీస్ షూటింగ్ సమయంలో విజయ్ సేతుపతితో కలిసి దిగిన ఓ సెల్ఫిని రాశీ షేర్ చేసింది. తన అభిమాన నటుడితో మరోసారి కలిసి నటించడం ఎంతో సంతోషంగా ఉంది అని,. హిందీలోకి ఆయనకు స్వాగతం అంటూ ఆమె పేర్కొంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.