యాప్నగరం

ప్రేమ అనే ఆలోచనను వదిలేశా: రెజీనా

టాలీవుడ్‌లో 'శివ మనసులో శృతి' అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రెజీనా రొటీన్ లవ్ స్టోరీ, కొత్త జంట ఇలా వరుస అవకాశాలను అందిపుచ్చుకుంది.

TNN 16 Sep 2017, 8:01 pm
టాలీవుడ్‌లో 'శివ మనసులో శృతి' అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రెజీనా రొటీన్ లవ్ స్టోరీ, కొత్త జంట ఇలా వరుస అవకాశాలను అందిపుచ్చుకుంది. ఆమె ఖాతాలో కొన్ని సక్సెస్ ఫుల్ సినిమాలు కూడా ఉన్నాయి. ఎన్ని హిట్స్ ఇచ్చినా.. ఆమెకు స్టార్ డమ్ మాత్రం దక్కలేదు. ఆమె తోటి హీరోయిన్లు టాప్ లీగ్‌లో దూసుకుపోతుంటే రెజీనా మాత్రం అవకాశాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి కలిగింది. తెలుగులో అవకాశాలు తగ్గడంతో తమిళంలో క్రేజ్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే తను ఈ స్థితిలో ఉండడానికి కారణం కెరీర్ ఆరంభంలో ప్రేమలో పడడమే అని చెబుతోంది ఈ బ్యూటీ.
Samayam Telugu heroine regina cassandra reacts on her love affairs
ప్రేమ అనే ఆలోచనను వదిలేశా: రెజీనా


ప్రేమలో పడటంతో తెలియకుండానే కొన్ని తప్పులు జరిగాయని ఇప్పుడు ఆ మత్తును వదిలించుకొని కెరీర్ పైనే దృష్టి పెడుతున్నానని చెబుతోంది. ఇకపై ప్రేమ, పెళ్లి అనే ఆలోచనలను నా మైండ్ లోకి తీసుకురానని స్పష్టం చేసింది. అయితే ఆమె ఎవరిని ప్రేమించిందనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఆమె చెప్పకపోతే ఏంటి.. ఆమె ప్రేమికుడు ఎవరనే విషయం అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్ అని కొందరు అంటున్నారు.


తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.