యాప్నగరం

ఇద్దరు ముద్దుగుమ్మలతో శర్వానంద్

టాలీవుడ్ టాప్ హీరోలతో పోటీ పడుతూ మార్కెట్‌ రేటును అంతకంతకూ పెంచుకుంటున్నాడు యంగ్ హీరో శర్వానంద్. ఇటీవల మహానుభావుడు మూవీతో హిట్ కొట్టిన శర్వానంద్ తన తర్వాతి చిత్రాన్ని లైన్‌లో పెట్టేశాడు.

TNN 3 Nov 2017, 5:07 pm
టాలీవుడ్ టాప్ హీరోలతో పోటీ పడుతూ మార్కెట్‌ రేటును అంతకంతకూ పెంచుకుంటున్నాడు యంగ్ హీరో శర్వానంద్. ఇటీవల మహానుభావుడు మూవీతో హిట్ కొట్టిన శర్వానంద్ తన తర్వాతి చిత్రాన్ని లైన్‌లో పెట్టేశాడు. స్వామిరారా, కేశవ లాంటి వైవిధ్యభరిత చిత్రాలతో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వా కొత్త చిత్రానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. అయితే ఈ మూవీలో శర్వానంద్.. యువకుడిగా.. మధ్య వయస్కుడిగా డ్యుయల్ రోల్‌లో కనిపించబోతున్నాడు. అయితే మధ్య వయస్కుడి పాత్ర పక్కన హీరోయిన్‌ కోసం కాజల్‌ను సంప్రదించగా ఆమె నో చెప్పిందని వార్తలు వచ్చాయి. కాగా ఈ మూవీలో శర్వా సరసన నటించే ఆ ఇద్దరు ముద్దు గుమ్మలను ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది.
Samayam Telugu heroines fixed for sharwanand next film
ఇద్దరు ముద్దుగుమ్మలతో శర్వానంద్


అర్జున్ రెడ్డి మూవీతో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించిన షాలిని పాండేని ఇప్పటికే ఓకే చేయగా.. తాజాగా జైలవకుశ, జెంటిల్మన్,​ నిన్నుకోరి, చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న నివేదా థామస్‌‌ను శర్వా సరసన నటించేందుకు ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. హారిక- హాసిని బ్యానర్‌లో ప్రముఖ నిర్మాత రాధాక్రిష్ణ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.