యాప్నగరం

‘పద్మావతి’ అనేది కల్పిత పాత్ర.. చరిత్రకారుడు!

బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ రూపొందించిన పద్మావతి చిత్రంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే. రాజపుత్ర రాణి పద్మిని జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని దర్శకుడు తెరకెక్కించారు.

TNN 9 Nov 2017, 3:03 pm
బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ రూపొందించిన పద్మావతి చిత్రంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే. రాజపుత్ర రాణి పద్మిని జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని దర్శకుడు తెరకెక్కించారు. రాజస్థాన్‌లో ఈ చిత్రానికి వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనలు ప్రారంభించారు. తాజాగా తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌కు దీనిపై వ్యాఖ్యలు చేశాయి. అలాగే ఈ చిత్రం రాజపుత్ర ఆత్మగౌరవాన్ని కించపరిచేదిగా ఉందని, నిలుపుదల చేయాలంటూ సుప్రీంకోర్టులోనూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆధునిక భారతదేశ చరిత్రలో 'పద్మావతి' అనే రాణే లేదని చరిత్రకారుడు గంగరాజు పేర్కొన్నారు. అల్లావుద్దీన్ ఖిల్జీ చరిత్రలో ఉన్నాడని, పద్మావతి అనేది ఓ నవలా రచయిత ఊహల రాణి అని ఆయన స్పష్టం చేశారు. అల్లావుద్దీన్ ఖిల్జీ కామాంధుడన్న కారణంతోనే ఈ సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలు ఉంటాయోమోనని రాజ్‌పుత్‌లు ఆందోళన చెంది ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
Samayam Telugu historian told padmavati an epic fictionalized poem
‘పద్మావతి’ అనేది కల్పిత పాత్ర.. చరిత్రకారుడు!


అంతే కాకుండా ఆ నవలలో పద్మావతిని నేరుగా చూపించడం ఇష్టం లేక వెనుదిరిగి ఉన్నప్పుడు అద్దంలో ఆమెను అల్లావుద్దీన్ ఖిల్జీ చూసినట్టు ఉంటుందని ఆయన తెలిపారు. ఇదంతా ఊహాజనితమైన కథేనని ఆయన స్పష్టం చేశారు. వాస్తవంగా మేవార్‌పై దాడిచేసిన అల్లావుద్దీన్ ఖిల్జీ రాజపుత్ర రాజు రావల్ రతన్ సింగ్‌ను ఓడించి, అతడి భార్య కమలాదేవిని బందీగా తీసుకెళ్లాడు. కమలాదేవిని ఢిల్లీకి తీసుకెళ్లిన ఖిల్జీ తన భార్యగా చేసుకున్నాడని ఆయన తెలిపారు. అల్లావుద్దీన్ ఖిల్జీకి పనిమనుషులు, బానిసలు అన్న తేడా ఉండేది కాదని, అందరినీ లైంగికంగా వాడుకుని, తన వాంఛలు తీర్చుకునేవాడని, ఇది చరిత్ర చెప్పిన సత్యమని ఆయన తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.