యాప్నగరం

Avatar 2 in Telugu డిస్ట్రిబ్యూషన్‌ కోసం పెరిగిన పోటీ.. రూ. 100 కోట్లు పైమాటే!

Avatar 2 సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఐదు నెలల క్రితం విడుదలైన టీజర్ ద్వారా మరో విజువల్ వండర్‌ని మన ముందుకు తీసుకురాబోతున్నట్లు జేమ్స్ కామెరూన్ స్పష్టం చేశాడు. ఈ మూవీ డిసెంబరులో..?

Authored byరాజేంద్ర గాలేటి | Samayam Telugu 2 Nov 2022, 1:54 pm
అవతార్ (Avatar) సినిమా వచ్చి 12 ఏళ్లు అయిపోయింది. ఈరోజుకీ ఆ మూవీ గురించి తలుచుకుంటే వింత ప్రపంచంలోకి మన జ్ఞాపకాలు వెళ్లిపోతాయి. అంతలా ప్రేక్షకులపై అవతార్ సినిమా చెరగని ముద్ర వేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే 2009లో రిలీజైన అవతార్ మూవీ విజువల్ వండర్. ఈ ఏడాది డిసెంబరులో ఆ వింత ప్రపంచాన్ని మరోసారి మన కళ్ల ముందుకు ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ (Avatar: The Way of Water) మూవీ రూపంలో తీసుకొచ్చేందుకు దర్శకుడు జేమ్స్ కామెరూన్ (James Cameron) సిద్ధమైపోయాడు.
Samayam Telugu Avatar 2 release date, trailer
అవతార్ -2 సినిమాకి భారీ డిమాండ్


ప్రపంచవ్యాప్తంగా ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ మూవీ 160 భాషల్లో డిసెంబరు 16న రిలీజ్‌కాబోతోంది. ఐదు నెలల క్రితం విడుదలైన టీజర్ ఈ సినిమాపై అంచనాల్ని రెట్టింపు చేసింది. త్వరలోనే ట్రైలర్‌ని కూడా రిలీజ్ చేయబోతున్నారు. దాంతో ఈ సినిమాని తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో విడుదల చేసేందుకు ఇక్కడి డిస్ట్రిబ్యూటర్స్ పెద్ద ఎత్తున పోటీపడుతున్నారు. ఇప్పటికే పోటీలో ఉన్న డిస్ట్రిబ్యూటర్లు రూ.100 కోట్లకి పైనే కొటేషన్ వేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఓ బడా నిర్మాత కమ్ డిస్ట్రిబ్యూటర్ ఏకంగా రూ.120 కోట్లు చెల్లించేందుకు రెడీ అయ్యారట.

అవతార్-1 సినిమా తరహాలోనే ఈ మూవీని కూడా సైన్స్ ఫిక్సన్ అడ్వెంచర్‌తో కూడిన థ్రిల్లర్‌గా జేమ్స్ కామెరూన్ రూపొందించారు. త్వరలోనే తెలుగు స్టేట్స్ థియేటర్స్ రైట్స్‌పై ఓ క్లారిటీరానుంది.

రచయిత గురించి
రాజేంద్ర గాలేటి
గాలేటి రాజేంద్ర సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ స్పోర్ట్స్, సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాస్తుంటారు. క్రికెట్ అంటే అమితమైన ఇష్టం. మ్యాచ్‌లకి సంబంధించి ఆసక్తికరమైన కథనాల్ని అందిస్తుంటారు. ఈయనకి జర్నలిజంలో 10 ఏళ్లకి పైగా అనుభవం ఉంది. గతంలో ఈనాడు.నెట్‌లో పనిచేశారు. అంతకముందు జర్నలిజంలో పీజీ చేయడంతో పాటు ఈనాడు జర్నలిజం స్కూల్‌లో శిక్షణ పొందారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.