యాప్నగరం

RX 100 దర్శకుడికి ఆఫర్లే ఆఫర్లు!

కొత్త వాళ్లను పెట్టి తీసిన RX 100తో సంచలన విజయం సొంతం చేసుకున్న దర్శకుడు అజయ్ భూపతికి అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి.

Samayam Telugu 16 Jul 2018, 3:51 pm
కొత్త వాళ్లను పెట్టి తీసిన RX 100తో సంచలన విజయం సొంతం చేసుకున్న దర్శకుడు అజయ్ భూపతికి అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. చిన్నబడ్జెట్ సినిమాగా రూపొందిన ఈ సినిమా తొలి వీకెండ్ లోనే భారీ వసూళ్లను సాధించింది. ఈ సినిమా ఇప్పటికే ఐదు కోట్ల రూపాయల షేర్‌ను సాధించినట్టుగా తెలుస్తోంది. ఇంకా ఈ సినిమా హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో నడుస్తోంది. దీంతో దీనికి భారీ వసూళ్లు ఖాయమని చెప్పాలి. ఇలా తొలి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టిన దర్శకుడిపై కూడా ప్రశంసల వర్షం కురుస్తోంది.
Samayam Telugu rx100


కేవలం ప్రశంసలు మాత్రమే కాకుండా.. ఇతడికి అవకాశాలు కూడా వెల్లువెత్తుతున్నాయని సమాచారం. ఇతడితో సినిమా చేయడానికి ప్రముఖ నిర్మాతలు ఉత్సాహం చూపిస్తున్నారని సమాచారం. వారిలో స్రవంతి రవికిషోర్ వంటి సీనియర్ నిర్మాత కూడా ఉన్నట్టుగా టాక్. రామ్ హీరోగా తీయడానికి తగిన సబ్జెక్ట్ తో రావాలని రవికిషోర్ అజయ్ భూపతికి సూచించినట్టుగా సమాచారం.

అలాగే మరో ప్రొడ్యూసర్ సుధాకర్ రెడ్డి కూడా ఈ దర్శకుడిని అభినందించి మంచి సబ్జెక్ట్ ఉంటే చెప్పమని అన్నారట. నితిన్ తండ్రి అయిన సుధాకర్ రెడ్డి తన తనయుడికి తగిన కథతో రావాలని సూచించారట. అలాగే భవ్య క్రియేషన్స్ సంస్థ కూడా అజయ్ భూపతిని సంప్రదించాలని.. అతడి దర్శకత్వంలో సినిమా చేయడానికి ఉత్సాహం చూపిస్తోందని తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.