యాప్నగరం

నాకు ఏం సంబంధం లేదు... దుష్ప్రచారం ఆపండి!

డ్రగ్స్ తీసుకునే తెలుగు చలన చిత్ర పరిశ్రమలోని వ్యక్తుల జాబితాలో తనపేరు ఉందంటూ మీడియాలో వస్తున్న వార్తలపై యువ నటుడు తనీష్ స్పందించాడు.

TNN 14 Jul 2017, 1:37 pm
డ్రగ్స్ తీసుకునే తెలుగు చలన చిత్ర పరిశ్రమలోని వ్యక్తుల జాబితాలో తనపేరు ఉందంటూ మీడియాలో వస్తున్న వార్తలపై యువ నటుడు తనీష్ స్పందించాడు. తాను షూటింగ్‌లో ఉండగా తన తల్లి ఫోన్ చేసి, టీవీలో వస్తున్న వార్తల గురించి సమాచారం అందించారని తెలిపాడు. తన కుమారుడు డ్రగ్స్ తీసుకున్నాడంటే కన్నతల్లి పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించాలని సూచించాడు. తన తండ్రి మరణం విషాదం నుంచి ఇంకా తాము కోలుకోలేదని తనీష్ అవేదన వ్యక్తం చేశాడు. అలాంటి సమయంలో ఈ దుష్ప్రచారం తమ కుటుంబాన్ని ఎంత కుంగదీస్తుందో చెప్పాలని తనీష్ ప్రశ్నించాడు. తనకు డ్రగ్స్‌తో ఎలాంటి సంబంధం లేదని, అసలు తనకు నోటీసులే రాలేదని, తనపేరు ఎందుకు బయటకు వచ్చిందో తెలియదని అన్నాడు. మత్తు పదార్థాలు తీసుకునే అలవాటు తనకు లేదని, ఇప్పుడు బురద జల్లడం వల్ల మీకు ఏం ప్రయోజనమని మీడియాను ప్రశ్నించాడు. తనపై దుష్ప్రచారం ఆపాలని తనీష్ మీడియాకు సూచించాడు.
Samayam Telugu hyderabad drugs scandal case actor tanish his involvement
నాకు ఏం సంబంధం లేదు... దుష్ప్రచారం ఆపండి!


మరోవైపు డ్రగ్స్ కేసులో పలువురు సినీ ప్రముఖుల పేర్లు బయటకు రావడంతో కలకలం రేగుతోంది. అయితే ఈ పేర్లు బయట పడటం పట్ల ఎక్సైజ్ డీఐజీ అకున్ సబర్వాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము సీనీ ప్రముఖులకు నోటీసులు జారీ చేశాం తప్ప, ఎవరి పేర్లూ బయటకు వెల్లడించలేదని అన్నారు. నోటీసులు జారీ అయిన వారిలో ప్రముఖులు కూడా ఉండటంతో ఎక్సైజ్ అధికారులపై తీవ్ర ఒత్తిడి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు, అకున్ సబర్వాల్ సెలవుపై వెళ్తున్నారు. అయితే, వ్యూహాత్మకంగానే మీడియాలో పేర్లు వచ్చేలా చేశారని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.