యాప్నగరం

బాలకృష్ణకు హైకోర్టు నోటీసులు!

ప్రముఖ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

TNN 28 Mar 2017, 2:24 pm
ప్రముఖ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. బాలకృష్ణతో పాటు ‘గౌతమీపుత్ర శాతకర్ణి’, ‘రుద్రమదేవి’ నిర్మాతలకు కూడా నోటీసులు పంపింది. వివరాల్లోకి వెళ్తే.. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’, ‘రుద్రమదేవి’ సినిమాలకు తెలంగాణ ప్రభుత్వం వినోదపు పన్ను మినహాయింపు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ కూడా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమాకు వినోదపు పన్నును మినహాయించింది. అయితే ఈ వినోదపు పన్ను మినహాయింపు నిర్మాతలకు కాకుండా ప్రేక్షకులకు మాత్రమే చెందేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది.
Samayam Telugu hyderabad high court sends notice to balakrishna
బాలకృష్ణకు హైకోర్టు నోటీసులు!


మంగళవారం ఈ పిల్‌ను విచారించిన హైకోర్టు బాలకృష్ణతో పాటు ‘గౌతమీపుత్ర శాతకర్ణి’, ‘రుద్రమదేవి’ నిర్మాతలకు నోటీసులు ఇచ్చింది. తమ నోటీసులకు రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. కాగా, ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమాకి ఏపీ ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇవ్వడంపై అప్పట్లో ‘రుద్రమదేవి’ నిర్మాత గుణశేఖర్ స్పందించారు. చారిత్రక కథతో తీసిన తన సినిమాకు కూడా వినోదపు పన్ను మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఓ లేఖ రాశారు. ఈ పన్ను మినహాయింపు ఇస్తే తనను ఆర్థికంగా ఆదుకున్నవారవుతారని లేఖలో గుణశేఖర్ పేర్కొన్నారు. కానీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన మినహాయింపుపై కూడా పిల్ దాఖలు కావడం ఆయన్ని కొంచెం ఇబ్బంది పెట్టే విషయమే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.