యాప్నగరం

'హైదరాబాద్ తల్వార్స్'ను ఆదర్శంగా తీసుకోవాలి -సురేష్ బాబు

ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ప్రాణాంతక వ్యాధుల్లో 'తలసీమియా' ఒకటి. ఈ వ్యాధి బారిన పడినవారు మూడు...

Samayam Telugu 14 Jun 2016, 7:18 pm
ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ప్రాణాంతక వ్యాధుల్లో 'తలసీమియా' ఒకటి. ఈ వ్యాధి బారిన పడినవారు మూడు వారాలకొకసారి తప్పనిసరిగా రక్తం ఎక్కించుకోవాలి. లేని పక్షంలో వ్యాధి మరింత ముదిరి మరణం చేరువవుతుంది. తలసీమియా వ్యాధిగ్రస్తుల సహాయార్ధం జూన్ 14న ప్రపంచ రక్తదాతల దినోత్సవ సందర్భంగా 'హైదరాబాద్ తల్వార్స్' (సెలబ్రిటీ క్రికెట్ టీం) బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించింది. హైదరాబాద్‌లోని తెలుగు ఫిలిం చాంబర్ ఇందుకు వేదికయ్యింది. జూన్ 14 మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ క్యాంప్ జరిగింది. డిల్లీలో తెలంగాణా ప్రభుత్వ సంచాలకులు రామచంద్రు, ఐ.ఎ.ఎస్. సినీ ప్రముఖులు తమ్మారెడ్డి భరద్వాజ, డి.సురేష్ బాబు, బి.గోపాల్, లగడపాటి శ్రీధర్, మధుర శ్రీధర్ రెడ్డి, ఆర్.పి. పట్నాయక్, శివారెడ్డి, లోహిత్, శాని, శ్రీధర్ రావు, రచ్చ రవి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. "
Samayam Telugu hyderabad talwars iniate for blood donation camp on blood donors day
'హైదరాబాద్ తల్వార్స్'ను ఆదర్శంగా తీసుకోవాలి -సురేష్ బాబు


తలసీమియా వ్యాధిగ్రస్తుల కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన హైదరాబాద్ తల్వార్స్ చైర్మన్ అభినవ్ సర్దార్ బృందాన్ని, వారికి సహకరించిన రక్తదాతలను సురేష్ బాబు ఎంతగానో అభినందించారు. ముఖ్యంగా "హైదరాబాద్ తల్వార్స్"ను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని సురేష్ బాబు పేర్కొన్నారు !

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.