యాప్నగరం

రాజధాని నిర్మాణం, అవి అబద్ధాలన్న రాజమౌళి!

ఏపీ నూతన రాజధాని నిర్మాణం విషయంలో తను కన్సల్టెంట్‌గా నియమితం అయ్యానన్న ప్రచారాన్ని

TNN 22 Sep 2017, 8:30 am
ఏపీ నూతన రాజధాని నిర్మాణం విషయంలో తను కన్సల్టెంట్‌గా నియమితం అయ్యానన్న ప్రచారాన్ని ఖండించాడు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. ఈ మేరకు ఆయన తన అధికారిక ఫేస్ బుక్ పేజీలో ఒక పోస్టు పెట్టారు. అమరావతి విషయంలో తను కన్సల్టెంట్ గా, డిజైనింగ్ సూపర్ వైజర్ గా నియమితం అయినట్టుగా వస్తున్న వార్తలు నిజం కాదని ఆయన స్పష్టం చేశారు. ఈ వివరణతో ఆయన పోస్టు పెట్టారు.
Samayam Telugu i am not a consultant for amaravathi ss rajamouli
రాజధాని నిర్మాణం, అవి అబద్ధాలన్న రాజమౌళి!


అందులో రాజమౌళి ఇంకా ఏమన్నారంటే..‘ఫోస్టర్, పార్టనర్స్ ప్రపంచ ప్రఖ్యాతి చెందిన నిర్మాణ సంస్థ. వాళ్లు సమర్పించిన డిజైన్లు ఫస్ట్ క్లాస్ గా ఉన్నాయని నాకు అనిపిస్తోంది. ఆ డిజైన్ల పట్ల చంద్రబాబుగారు, ఆయన టీమ్ చాలా ఆనందంగా ఉంది. అయితే వారు భవనాలు మరింత ఐకానిక్ గా ఉండాలని అనుకుంటున్నారు. నా పనల్లా.. బాబుగారి ఆలోచనలను ఫోస్టర్స్ తో పంచుకుని.. పని త్వరగా పూర్తయ్యేలా చూడటమే. ఈ ఎపిక్ ప్రాజెక్టులో స్వల్పమే అయినా నా భాగస్వామ్యం ఉపయోగపడుతుందని ఆశ..’ అని రాజమౌళి ఫేస్ బుక్ లో పేర్కొన్నారు.

ఈ విధంగా రాజధాని డిజైన్ల ఎంపిక విషయంలో తన ప్రమేయం గురించి వివరణ ఇచ్చాడు ఈ దర్శకుడు. మరోవైపు ఏపీ నూతన రాజధాని నిర్మాణం డిజైన్ల విషయంలో సినిమా దర్శకుడి ప్రమేయంపై విమర్శలు తప్పడం లేదు. తనకు ఆర్కిటెక్చర్ గురించి ఎలాంటి అవగాహన లేదని ఇది వరకూ స్వయంగా రాజమౌళి స్పష్టం చేసిన నేపథ్యంలో.. సోషల్ మీడియాలో బాబు ప్రభుత్వంపై సెటైర్లు పడుతున్నాయి. రాజధాని నిర్మాణం డిజైన్లకు రాజమౌళి సహకారం తీసుకుంటున్నారు. మరి రేపు పాక్ తోనో, చైనాతోనో యుద్ధం వస్తే.. ప్రభాస్ ను పంపిస్తారా? అని కొంతమంది వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.